హైదరాబాద్: టీఆర్ఎస్ లో ఉద్యమ కారులను పట్టించుకోవడం లేదని శాసనమండలి  మాజీ ఛైర్మెన్ స్వామి గౌడ్ ఆరోపించారు. ఆదివారం నాడు ఆయన మీడియాతో మాట్లాడారు.పార్టీ మారిన కొంత మంది నేతలు ఉద్యమకారులపై పెత్తనం చలాయిస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. 

తాను పార్టీ మారే ప్రసక్తే లేదని మాజీ శాసనమండలి ఆయన స్పష్టం చేశారు. పార్టీపై తనకు ఎలాంటి కోపం లేదన్నారు. పార్టీలో అందర్నీ కలుపుకుపోయేలా కేసీఆర్  పార్టీ నేతలకు ఆదేశాలు ఇవ్వాలని ఆయన కోరారు. 

బీసీలకు అన్యాయం జరుగుతుందని చెప్పిన మాట నిజమేనని ఆయన చెప్పారు.ఇటీవల కాలంలో శాసనమండలి ఛైర్మెన్  స్వామి గౌడ్  చేసిన కామెంట్స్ సంచలనం సృష్టించాయి. ఈ కామెంట్స్ రాష్ట్ర రాజకీయాల్లో చర్చకు దారి తీశాయి.

also read:టీఆర్ఎస్‌లో స్వామిగౌడ్ వ్యాఖ్యల కలకలం: అసంతృప్తే కారణమా?

మరో వైపు కాంగ్రెస్ పార్టీ నేత రేవంత్ రెడ్డి ని ప్రశంసించడం కూడ టీఆర్ఎస్ లో చర్చకు దారి తీసింది. స్వామిగౌడ్ చేసిన వ్యాఖ్యలు సర్వత్రా చర్చనీయాంశంగా మారాయి. అసంతృప్తి కారణంగానే ఆయన ఈ వ్యాఖ్యలు చేశారనే ఆభిప్రాయాలు కూడ వ్యక్తమౌతున్నాయి.