భారత మాజీ క్రికెటర్ మహ్మద్ అజారుద్దీన్ ఇంట విషాదం నెలకొంది. అజారుద్దీన్ తండ్రి అజీజుద్దీన్ మంగళవారం చనిపోయారు. చాలాకాలంగా ఊపిరితిత్తుల సమస్యతో బాధపడుతున్న ఆయన హాస్పిటల్లో చికిత్స పోందుతున్నారు. నేడు ఆయన ఆరోగ్యం విషమించడంతో ఆస్పత్రిలోనే కన్నుమూశారు.
టీమిండియా మాజీ కెప్టెన్ మహ్మద్ అజారుద్దీన్ ఇంట విషాదం నెలకొంది. ఆయన తండ్రి అజీజుద్దీన్ మంగళవారం కన్నుమూశారు. సుదీర్ఘకాలంగా ఊపిరితిత్తుల సమస్యతో అజీజుద్దీన్ బాధపడుతున్నారు. ఇటీవల తీవ్ర అనారోగ్యానికి గురైన ఆయనను ఆసుపత్రిలో చేర్చారు. ఆయన పరిస్థితి విషమించడంతో నేడు తుదిశ్వాస విడిచారు. అజీజుద్దీన్ మరణంలో అజర్ కుటుంబ సభ్యులు విషాదంలో మునిగిపోయారు. కాగా, అజర్ తండ్రి అంత్యక్రియలు రేపు నిర్వహించనున్నారు. బంజారాహిల్స్ లోని మసీదులో మతపరమైన కార్యక్రమాలు నిర్వహించనున్నట్టు సమ ాచారం.
