ఉచిత విద్యుత్ పథకం రూపకర్త, మాజీ సీఎస్ జన్నత్ హుస్సేన్ ఇక లేరు

ఉమ్మడి ఏపీలో చంద్రబాబు నాయుడు, రాజశేఖర్ రెడ్డి సీఎంలుగా ఉన్న సమయంలో సీఎస్ గా పని చేసిన రిటైర్డ్ ఐఏఎస్ అధికారి జన్నత్ హుస్సేన్ చనిపోయారు. (Former Chief Secretary Jannat Hussain passes away) ఆయన రైతులకు ఉచిత విద్యుత్ అందించే పథకానికి విధి విధానాలు రూపొందించారు.

Former CS Jannat Hussain, the architect of the free electricity scheme, is no more..ISR

ఉమ్మడి ఏపీలో రైతులకు ఉచిత విద్యుత్ అందించే పథకానికి విధి విధానాలు రూపకల్పన చేసిన మాజీ సీఎస్, రిటైర్డ్ ఐఏఎస్ జన్నత్ హుస్సేన్ మృతి చెందారు. గత కొంత కాలంగా ఆయన అల్జీమర్స్ తో బాధపడుతున్న ఆయన.. సూళ్లురుపేటలోని తన ఇంట్లో శుక్రవారం తెల్లవారుజామున మరణించారు. ఉమ్మడి ఏపీలో గొప్ప హోదాల్లో ఆయన పని చేశారు. కానీ తన హోదా, ఉద్యోగం చేసిన విషయం కూడా ఆయనకు చివరి సమయంలో గుర్తు లేకపోవడం విచారకరం. పంజాగుట్ట శ్మశాన వాటికలో ఆయన అంత్యక్రియలు జరగనున్నాయి.

MLA Lasya Nanditha : బీఆర్ఎస్ ఎమ్మెల్యే లాస్య నందిత మృతి

జన్నత్ హుస్సేన్ 1977 బ్యాచ్ కు చెందిన ఐఏఎస్ అధికారి. ఉమ్మడి ఏపీలో పలు జిల్లాలకు కలెక్టర్ గా సేవలు అందించారు. నారా చంద్రబాబు నాయుడు, వైఎస్ రాజశేఖర్ రెడ్డి సీఎంలుగా పని చేసిన కాలంలో ఆయన ఏపీకి సీఎస్ గా కొనసాగారు. నాలుగు దశాబ్దాల పాటు తెలుగు రాష్ట్రానికి వివిధ హోదాల్లో సేవలందించిన ఆయన.. వైఎస్ రాజశేఖర్ రెడ్డి తొలిసారి సీఎంగా ప్రమాణ స్వీకారం చేసే సమయంలో రైతులకు ఉచిత విద్యుత్ అందించే ఫైల్ పై సీఎస్ హోదాలో సంతకం చేశారు. 

జర్నలిస్ట్ శంకర్ పై మూకుమ్మడి దాడి.. సీసీ కెమెరాలో ఘటన రికార్డు.. ఖండించిన మాజీ మంత్రులు..

దీంతో పాటు ఆ పథకానికి విధివిధానాలను కూడా ఆయననే రూపొందించారు. దీంతో చారిత్రాత్మక పథకానికి మార్గదర్శకాలు తయారు చేసిన వ్యక్తిగా గుర్తింపు పొందారు. సుధీర్ఘ కాలం పాటు ఐఏఎస్ గా సేవలు అందించిన ఆయన 2010 డిసెంబర్ 31వ తేదీన ఉద్యోగ విరమణ పొందారు. రోషయ్య ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ కు చీఫ్ కమిషనర్ గా బాధ్యతలు చేపట్టి.. 2014 వరకు అదే పదవిలో కొనసాగారు. జన్నత్ హుస్సేన్ కు భార్య, ఇద్దరు కుమారులు, ఓ కూతురు ఉన్నారు. 

కాగా.. జన్నత్ హుస్సేన్ మరణం పట్ల తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి విచారం వ్యక్తం చేశారు. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. ఈ విషాద సమయంలో ఆ కుటుంబానికి భగవంతుడు మనోధైర్యాన్ని ప్రసాదించాలని ఆయన ప్రార్థించారు. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios