Asianet News TeluguAsianet News Telugu

మాజీ సీఎం కేసీఆర్ హిప్ రీప్లేస్ మెంట్ సర్జరీ విజయవంతం.. వైద్యులు ఏం చెప్పారంటే..

KCR: మాజీ సీఎం కేసీఆర్ హిప్ రీప్లేస్ మెంట్ సర్జరీ విజయవంతమైంది. శస్త్రచికిత్స పూర్తయిన తర్వాత మాజీ ముఖ్యమంత్రిని ప్ర‌త్యేక‌ గదికి తరలించామనీ, ప్రస్తుతం ఆయన కోలుకుంటున్నారని యశోద హాస్పిటల్స్ వైద్యులు హెల్త్ బులెటిన్ లో పేర్కొన్నారు. 
 

former chief minister K Chandrashekhar Rao KCR's hip replacement surgery successful RMA
Author
First Published Dec 8, 2023, 10:13 PM IST

KCR’s hip replacement surgery successful: సోమాజిగూడలోని యశోద ఆస్పత్రిలో తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి క‌ల్వ‌కుంట్ల చంద్రశేఖర్ రావు (కేసీఆర్) కు హిప్ రీప్లేస్ మెంట్ సర్జరీ విజయవంతంగా పూర్తయింది.  శస్త్రచికిత్స పూర్తయిన తర్వాత మాజీ ముఖ్యమంత్రిని ప్ర‌త్యేక‌ గదికి తరలించామనీ, ప్రస్తుతం ఆయన కోలుకుంటున్నారని యశోద హాస్పిటల్స్ వైద్యులు హెల్త్ బులెటిన్ లో పేర్కొన్నారు. ఐవీ ఫ్లూయిడ్స్, ప్రొఫిలాక్టిక్ యాంటీబయాటిక్స్, పెయిన్ మెడిసిన్స్ తో సహా శస్త్రచికిత్స అనంతర సంరక్షణను ఆయన పొందుతున్నారని వివరించింది. ఆయ‌న ఆరు నుంచి ఎనిమిది వారాల్లో పూర్తిగా కోలుకుంటార‌ని వైద్యులు తెలిపారు.
 

అసలేంటీ తుంటి కీలు :  

మనిషి శరీరంలో కీలకమైన ఎముక ఈ తుంటి కీలు. శరీర బరువును  మోసేది తుంటి కీళ్లే. శరీరం పైభాగం కాళ్లకు అనుసంధానం చేయడంతో పాటు కాళ్లను ఏ వైపు కావాలంటే ఆ వైపునకు కదపవచ్చు. అందుకే ఈ తుంటికీలుకు ఏ చిన్న అనారోగ్య సమస్య వచ్చినా జీవితం మంచానికే అంకితం. అనుకోని ప్రమాదాల కారణంగా తుంటి కీలు విరిగితే రక్త ప్రసరణ ఆగిపోవడంతో పాటు కీలు అరుగుదల అనే దశ ప్రారంభమవుతుంది.  

తుంటి కీలు మార్పిడి చికిత్స : 

తుంటి కీలులో ఓ బంతి , సాకెట్ లాంటి నిర్మాణాలు అత్యంత కీలకమైనవి. ఒకప్పుడు తుంటి ఎముక విరిగితే మంచానికే అతుక్కొని పోవాల్సి వచ్చేది. చివరికి కాలకృత్యాలు కూడా తీర్చుకోవడం కష్టమై, బతుకు భారమై.. ఇంకెందుకీ జీవితం అన్నట్లుగా ఎంతోమంది పెద్దలు నరకయాతన అనుభవించారు. మంచంలోనే ప్రాణాలు కోల్పోయిన వారు ఎందరో. ఇప్పుడు వైద్య శాస్త్రం ఎంతగానో అభివృద్ధి చెందడంతో పలు రకాల సర్జరీలు అందుబాటులోకి వచ్చాయి. తుంటి కీలు విరిగిన వృద్ధులు శస్త్రచికిత్స తర్వాత కొన్ని రోజులు రెస్ట్ తీసుకుంటే చాలు.. తర్వాత ఎవరిపై ఆధారపడకుండా సాధారణ జీవితం గడపొచ్చు. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios