దేశభక్తిపై విద్యార్ధిని ప్రసంగం, పోకిరీల న్యూసెన్స్: ఆగ్రహం వ్యక్తం చేసిన సీబీఐ మాజీ జేడీ
నల్గొండలో జరిగిన ఓ కార్యక్రమంలో సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశభక్తిపై ఓ విద్యార్ధిని ప్రసంగిస్తున్న సమయంలో పోకీరీలు న్యూసెన్స్ చేయడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
నల్గొండ:ఎప్పుడూ ప్రశాంతంగా కన్పించే సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ ఆగ్రహంతో ఊగిపోయారు. ఓ కార్యక్రమంలో కొందరు పోకీరీలు చేసిన వ్యాఖ్యలపై ఆయన మండిపడ్డారు. వారిని కార్యక్రమం నుండి బయటకు వెళ్లిపోవాలని కోరారు.
నల్గొండ పట్టణంో సామూహిక జనగనమణ కార్యక్రమం ప్రారంభించి రెండేళ్లు పూర్తైన సందర్భంగా సోమవారం నాడు ఓ కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ కార్యక్రమంలో పలు విద్యా సంస్థల విద్యార్ధినీ, విద్యార్ధులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
దేశభక్తి గురించి ఓ విద్యార్ధిని ఈ కార్యక్రమంలో ప్రసంగిస్తున్న సమయంలో కొందరు పోకీరీలు న్యూసెన్స్ చేశారు. దీంతో సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ సీరియస్ అయ్యారు. మైక్ తీసుకొని ఆగ్రహంతో ఊగిపోయారు. దేశభక్తి గురించి ఓ విద్యార్ధిని ప్రసంగిస్తున్న సమయంలో పోకీరీలు చేసిన పనిని ఆయన తప్పుబట్టారు. ఏం సాధించారని ఆయన వారిని ప్రశ్నించారు. విద్యార్ధిని ప్రసంగించే సమయంలో న్యూసెన్స్ చేసిన వారిని తాను గమనించినట్టుగా చెప్పారు. పిల్లి కూతలు, కారు కూతలు కూసిన వారిని సమావేశం నుండి వెళ్లిపోవాలని ఆయన కోరారు. ఈ తరహ పద్దతులు మానుకోవాలని కూడా ఆయన విద్యార్ధులకు సూచించారు.