హైదరాబాద్: అనుమతులు లేకుండా భారీ ఎత్తున చెట్లు కొట్టేసిన ఓ రియల్ ఎస్టేట్ సంస్థకు అటవీ శాఖ భారీ జరిమానా విధించింది. తన వెంచర్ ను విస్తరించేందుకు గాను వందలాది చెట్లను నరికిన సంస్థకు ఇరవై లక్షల రూపాయాల భారీ జరిమానాను విధించింది.

అటవీ శాఖ. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కీసర మండలం బొమ్మరాస్ పేట్ లో వాసవి గ్రీన్ లీఫ్ వెంచర్స్ లో పది రోజుల కిందట భారీగా చెట్లను సరికివేశారు.ఫిర్యాదు అందుకున్న మేడ్చల్ జిల్లా అటవీ అధికారి వెంకటేశ్వర్లు విచారణ జరిపించారు. వెంచర్స్ యాజమాన్యం ఎలాంటి అనుమతులు లేకుండా వందలాది భారీ వృక్షాలను నరికేసిన విషయాన్ని నిర్థారించారు. ఈ విషయమై కేసు నమోదు చేశారు. 

ఇదే సంస్థతో భారీగా మొక్కలు నాటిస్తామని అధికారులు తెలిపారు. స్వంత భూముల్లో కూడ చెట్లు కొట్టేందుకు అనుమతులు తీసుకోవాలని ఫారెస్ట్  అధికారులు తెలిపారు.ఎవరైనా చెట్లు కొట్టేందుకు అనుమతి కోరితే విచారణ జరిపి, నిబంధనల ప్రకారం అనుమతి ఇస్తామన్నారు.