హైదరాబాద్: బేగంబజార్ లోని పాలిటెక్నిక్ కళాశాలలో ఫుడ్ పాయిజన్ కలకలం రేపింది. పాలిటెక్నిక్ కళాశాలలో విషాహారం తిని 50 మంది విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. విద్యార్థులు ఒక్కసారిగా వాంతులు వీరోచనాలతో బాధపడుతుండటంతో వారిని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు హాస్టల్ సిబ్బంది.

 పాయిజన్ కావడంపై విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కళాశాల హాస్టట్ వద్ద ఆందోళనకు దిగారు. తమకు నాణ్యతలేని ఫుడ్ ను అందిస్తున్నారంటూ విద్యార్థులు రోడ్డుపై ధర్నా చేశారు. 

ఎన్నిసార్లు చెప్తున్నా హాస్టల్ సిబ్బంది పట్టించుకోవడం లేదని తమకు నాసిరకం ఫుడ్ పెట్టడంతోపాటు, నిల్వ ఉంచిన ఆహారాన్ని కూడా సరఫరా చేస్తున్నారంటూ విద్యార్థులు ఆరోపించారు.