Asianet News TeluguAsianet News Telugu

టిఆర్ఎస్ ఎమ్మెల్యే పుట్టా మధుకు కొత్త నెత్తి నొప్పి

బెదిరింపుల కేసులో రెండోసారి పుట్టా మధు అనుచరుడి అరెస్టు

గతంలో అరెస్టు అయినా కేసు కొట్టేసిన పోలీసులు

పుట్టా మధు విషయంలో గుర్రుగా ఉన్న సిఎం కేసిఆర్

follower drags trs mla putta madhu into new controversy

పెద్దపల్లి జిల్లా మంథని ఎమ్మెల్యే పుట్టా మధు కు కొత్త నెత్తి నొప్పి వచ్చి పడింది. ఇప్పటికే పీకలలోతు వివాదాల్లో చిక్కుకున్న పుట్టా మధు మెడకు మరో వివాదం సుట్టుకున్నది. దీంతో ఆయన చిక్కుల్లో పడ్డారు. ఇంతకూ పుట్టా మధుకు వచ్చిన చిక్కులేంటి? ఆయన ఎందుకు ఆ వివాదంలో చిక్కుకున్నారో తెలియాలంటే ఈ వార్త చదవండి.

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 2014 ఎన్నికల్లో ఉద్ధండుడైన దుద్దిళ్ల శ్రీధర్ బాబును మట్టికరిపించి పుట్టా మధు గెలుపొందారు. కానీ పుట్టా మధు గెలినప్పటినుంచి ఆయన చుట్టూ వివాదాలు నెలకొంటూనే ఉన్నాయి. జిల్లాలో ఆయన ఎప్పటికప్పుడు వివాదాస్పదమైన నేతగానే చెలామణి అవుతూ వచ్చారు. 2014 ఎన్నికల కంటే ముందు 2009లో పుట్టా మధు పిఆర్పీ తరుపున ఇదే నియోజకవర్గంలో పోటీ చేసి ఓడిపోయారు. ఆ తర్వాత వైసిపి లోకి చేరిపోయారు.

తాజాగా  పుట్టామ మధు ముఖ్య అనుచరుడైన మంథని ఎంపిపి కమల కొడుకు శ్రీధర్ గౌడ్ కటకటాలపాలయ్యాడు. ఆయన ఏ దేశ సేవ చేసి ప్రజా సేవ చేసో అరెస్టు కాలేదు. చిల్లర పనులు చేస్తూ దొంగ పోలీసు అవతారమెత్తి జనాలను బెదిరించి డబ్బులు వసూలు చేస్తుంటే పోలీసులు అరెస్టు చేశారు. అయితే ఆ ఎంపిపి కమల కుటుంబం పుట్టా మధుకు అత్యంత ముఖ్య అనుచరులుగా ముద్ర పడ్డారు. దీంతో శ్రీధర్ గౌడ్ అరెస్టు వ్యవహారం పుట్టా మధుకు ఇబ్బందులు సృష్టిస్తోంది.

follower drags trs mla putta madhu into new controversy

సదరు ఎంపిపి కొడుకు శ్రీధర్ గౌడ్ గతంలోనూ గోదావరిఖని ఏరియాలో బొమ్మ తుపాకీ వెంట పెట్టుకుని తాను పోలీస్ అంటూ బార్ లలో, ఇంకొన్ని ప్రదేశాల్లో దందాలు చేసినట్లు ఆరోపణలున్నాయి. బొమ్మ తుపాకీతో ఏకంగా డిఎస్పీ స్థాయి అధికారినే బెదిరించినట్లు శ్రీధర్ గౌడ్ మీద ఆరోపణలున్నాయి. ఆ సమయంలో శ్రీధర్ ను పోలీసులు అరెస్టు చేసి జైలుకు తోలారు. కానీ ఏమైందో ఏమో ఆ కేసును మూసేశారు. ఎందుకు కేసును మూసేశారా అన్న అనుమానాలు ఇప్పటికీ జనాల్లో ఉన్నాయి.

ఇక అలవాటు పడ్డ ప్రాణం ఊకుంటదా అన్నట్లు అప్పట్లో అరెస్టయి జైలుకు వెళ్లి వచ్చిన తర్వాత కూడా శ్రీధర్ గౌడ్ మళ్లీ దందాలు చేస్తూనే ఉన్నాడు. తాజాగా హైదరాబాద్ లోని చిలకలగూడ పోలీసులు అరెస్టు చేశారు. దీంతోపాటు మళ్లీ బొమ్మ తుపాకులు స్వాధీనం చేసుకుని రిమాండ్ చేశారు.

హైదరాబాద్ లో మంథని ఎంపిపి కొడుకు అరెస్టు అయిండన్న వార్త కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో గుప్పుమన్నది. పుట్టా మధు అనుచరుడే జైలులో ఉన్నది అంటూ జనాలు చర్చించుకుంటున్నారు. రాజకీయ పార్టీల్లో ఈ చర్చలు జోరందుకున్నాయి.

అయితే అసలే సిఎం పుట్టా మధు మీద గుర్రుగా ఉన్న నేపథ్యంలో ఈ పరిణామం చోటు చేసుకుంది. గతంలో పుట్టా మధును సిఎం సున్నితంగా హెచ్చరించారు. అలాగే జిల్లా మంత్రి ఈటల రాజేందర్ కూడా పుట్టా మధును హెచ్చరించారు. గతంలో దళిత యువకుడు మంథని మధుకర్ హత్య కేసులో పుట్టా మధు తీవ్ర ఆరోపణలు ఎదుర్కొన్నారు. మంత్రి ఈటల, జిల్లా కలెక్టర్ ముందే కిందిస్థాయి అధికారులను బెదిరించారు. కొంతమంది అధికారులపై పుట్టా మధు చేయి చేసుకున్నారన్న విమర్శలు కూడా ఉన్నాయి.

దీనికితోడు ఆయనకు టిఆర్ఎస్ టికెట్ రాకపోతే బజెపిలోకి పోతారన్న ప్రచారం ఉంది. పుట్టా మధు లా తయారైనవా అంటూ సిఎం కేసిఆర్ ఒకసారి జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డిని మందలించారు కూడా. ఇక పుట్టా మధును పార్టీలోకి కల్వకుంట్ల కవిత తీసుకొచ్చారు. కానీ తాజాగా ఆ నియోజకవర్గంలో సునీల్ రెడ్డి అనే నేతను మంత్రి కేటిఆర్ ప్రోత్సహిస్తున్నారని కూడా ప్రచారంలో ఉంది. ఇది పుట్టా మధుకు జీర్ణించుకోలేక ఆయన బిజెపి వైపు చూస్తున్నారని చెబుతున్నారు.

మొత్తానికి శ్రీధర్ గౌడ్ అరెస్టు వ్యవహారం పుట్టా కు కొత్త నెత్తినొప్పి తెచ్చి పెట్టిందని జనాలు చర్చించుకుంటున్నారు.

 

మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

 

Follow Us:
Download App:
  • android
  • ios