కూల్ డ్రింక్ కొనిస్తానని ఐదేండ్ల చిన్నారిని బయటకు తీసుకెళ్లిన వలస కూలీ.. తర్వాత ఏం జరిగిందంటే..!

హైదరాబాద్ శివార్లలో దారుణం చోటుచేసుకుంది. ఐదేళ్ల బాలికపై బీహార్‌కు చెందిన 60 ఏళ్ల వలస కూలీ దారుణానికి పాల్పడ్డాడు. ఆ చిన్నారికి కూల్ డ్రింక్ కొనిస్తానని ప్రలోభపెట్టి.. అత్యాచారం చేసి.. అత్యంత దారుణంగా హత్య చేశారు.ఈ దారుణమైన నేరానికి పాల్పడిన కామాంధుడిని  అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. హైదరాబాద్‌ సమీపంలోని సంగారెడ్డి జిల్లా భానూర్‌లో దారుణ ఘటన చోటుచేసుకుంది.  

 

Five-year-old girl raped and murdered by migrant worker in Hyderabad KRJ

దేశంలో ఆడపిల్లలకు రక్షణ లేకుండా పోతోంది. మహిళలు, యువతుల పట్ల ఆకతాయిలు అసభ్యంగా ప్రవర్తిస్తున్నారు. ఆకతాయిల ఆటకట్టించడంలో మాత్రం ప్రభుత్వాలు విఫలమవుతోనే ఉన్నాయి. అమ్మాయిల రక్షణ కోసం ఎన్ని కఠినమైన చట్టాలు తీసుకొచ్చినా.. కఠిన శిక్షలు విధించిన వారిలో మార్పు రావడం లేదు. యువతులను, చిన్నారులను వేధిస్తూ.. వారిపై లైంగికదాడులకు పాల్పడుతున్నారు. ఈ విషయం ఎక్కడ వెలుగులోకి వస్తుందనే భయంతో వారిని అక్కడి హతమొందిస్తున్నారు. తాజాగా ఇలాంటి ఘటననే హైదరాబాద్ శివార్లలో చోటుచేసుకుంది.

బీహార్‌కు చెందిన 60 ఏళ్ల వలస కూలీ.. కూల్ డ్రింగ్ కొనిస్తానని   ఐదేళ్ల బాలికను ప్రలోభపెట్టి అత్యాచారం చేసి హత్య చేశాడు. ఈ దారుణమైన ఘటన సంగారెడ్డి జిల్లా భానూర్‌లో చోటుచేసుకుంది. సోమవారం రాత్రి బీడీఎల్ భానూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పత్తి పొలాల్లో బాలిక మృతదేహం లభ్యం కావడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. 60 యేండ్ల నిందితుడు చిన్నారికి కూల్ డ్రింగ్ కొనిస్తానని బాలికను ప్రలోభపెట్డాడు. ఆ కామాంధుడిని నమ్మిన బాలికను సమీపంలోని పొలాల్లోకి తీసుకెళ్లి అత్యాచారం చేశాడు. ఆ చిన్నారి కేకలు పెట్టడంతో ఆ విషయం ఎక్కడ బయటకు వస్తోందోనని చిన్నారిని హత్య చేశాడు.  

బాధితురాలు తన తల్లిదండ్రులు, తాతయ్యలతో కలిసి నిర్మాణ స్థలంలో ఉంటున్నట్లు పోలీసు అధికారి తెలిపారు. ఆమె తల్లిదండ్రులు ఇటీవల వారి స్వగ్రామానికి వెళ్లారు. వారి కుమార్తెను ఆమె తాతయ్య దగ్గర ఉంచారు. ఆ చిన్నారి తాతయ్య సోమవారం పని నిమిత్తం బయటకు వెళ్లాడు. సాయంత్రం తిరిగి వచ్చేసరికి ఆ చిన్నారి కనిపించకుండా పోయింది. దీంతో కంగారు పడ్డ ఆ చిన్నారి తాతయ్య వెతకడం ప్రారంభించారు. 

ఈ క్రమంలో నిర్మాణ స్థలంలో ఉన్న వాచ్‌మెన్.. వలస కూలీతో అమ్మాయిని చూశానని చెప్పాడు. వాచ్‌మెన్, ఇతర కార్మికులు అనుమానితుడి దగ్గరకు వెళ్లి ప్రశ్నించగా.. అసలు విషయం బయటపెట్టాడు. వారు పోలీసులకు సమాచారం అందించగా నిందితుడు నేరం అంగీకరించాడు. పోలీసులు మృతదేహాన్ని శవపరీక్ష నిమిత్తం తరలించి నిందితులను అదుపులోకి తీసుకున్నారు. నిందితుడిపై పోక్సో చట్టం, జువైనల్ జస్టిస్ చట్టం కింద కేసు నమోదు చేశారు. నిందితుడిని కోర్టులో హాజరుపరచగా, జ్యుడీషియల్ కస్టడీకి తరలించారు.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios