స్థానిక సంస్థల (local body quota mlc) కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు (mlc elections) సంబంధించి టీఆర్‌ఎస్‌ (trs) నుంచి 12 మంది అభ్యర్థులు ఖరారైనట్లుగా తెలుస్తోంది. పెద్దల సభకు పంపే నేతల లిస్ట్‌కు సీఎం కేసీఆర్‌ గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చినట్లు సమాచారం. సిట్టింగ్‌లలో ఐదుగురికే మరో ఛాన్స్ ఇవ్వగా.. ఏడుగురికి ఉద్వాసన పలికారు. 

స్థానిక సంస్థల (local body quota mlc) కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు (mlc elections) సంబంధించి టీఆర్‌ఎస్‌ (trs) నుంచి 12 మంది అభ్యర్థులు ఖరారైనట్లుగా తెలుస్తోంది. పెద్దల సభకు పంపే నేతల లిస్ట్‌కు సీఎం కేసీఆర్‌ గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చినట్లు సమాచారం. సిట్టింగ్‌లలో ఐదుగురికే మరో ఛాన్స్ ఇవ్వగా.. ఏడుగురికి ఉద్వాసన పలికారు. దీంతో ఏడుగురు కొత్తవారికి అవకాశం లభించినట్లయ్యింది. 12మంది ఎమ్మెల్సీ అభ్యర్థులు రేపు నామినేషన్‌ దాఖలు చేయనున్నారు. 

మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్, నల్గొండ, ఖమ్మంలో కొత్త వారికి ఛాన్స్ ఇచ్చారు. మహబూబ్ నగర్‌లో ఒకరికి , కరీంనగర్‌లో ఒకరికి కొత్తగా అవకాశం ఇచ్చారు కేసీఆర్. బీసీలకు , ఓసీలకు 7, ఎస్సీలకు ఒక్క సీటును కేటాయించారు. ఎన్నికల బాధ్యతలను జిల్లా మంత్రులకు అప్పగించారు సీఎం. నిజామాబాద్‌లో కల్వకుంట్ల కవిత (kalvakuntla kavitha) సీటు మరొక మహిళలకు కేటాయించారు . సిట్టింగ్‌లలో కరీంనగర్ నుంచి భానుప్రసాద్, వరంగల్ నుంచి పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి, రంగారెడ్డి నుంచి శంభీపూర్‌ రాజు, పట్నం మహేందర్‌రెడ్డి, మహబూబ్‌నగర్ నుంచి కసిరెడ్డికి మరోసారి ఛాన్స్ ఇచ్చారు కేసీఆర్. ఆదిలాబాద్ ఎమ్మెల్సీ పురాణం సతీశ్ స్థానంలో దండే విఠల్‌కు అవకాశం ఇచ్చారు. 2014 ఎన్నికల్లో దండే విఠల్ సనత్‌నగర్ ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయారు.

ALso Read:ఎమ్మెల్సీ ఎన్నికలు: 12 మంది అభ్యర్థులను ఫైనల్‌ చేసిన కేసీఆర్ .. ఎవరనే దానిపై ఉత్కంఠ..!!

కరీంనగర్ నుంచి నారదాసు స్థానంలో టీడీపీ నుంచి పార్టీలో చేరిన ఎల్.రమణ (l ramana), నల్లగొండ నుంచి తేరా చిన్నపరెడ్డి స్థానంలో ఎంసీ కోటిరెడ్డికి ఛాన్స్‌ ఇచ్చారు. నిజామాబాద్ నుంచి మరోసారి పోటీకి సీఎం కుమార్తె కల్వకుంట్ల కవిత ఆసక్తి చూపలేదు. దీంతో మాజీ ఎమ్మెల్సీ ఆకుల లలితకు అవకాశం ఇచ్చారు. ఖమ్మం ఎమ్మెల్సీ కోసం గట్టి లాబీయింగ్ జరిగింది. చివరికి సిట్టింగ్ ఎమ్మెల్సీ బాలసాని స్థానంలో తాతా మధుకు ఛాన్స్ ఇచ్చారు ముఖ్యమంత్రి. మెదక్ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్సీ భూపాల్ రెడ్డి స్థానంలో డాక్టర్ యాదవరెడ్డికి ఛాన్స్ ఇచ్చారు. మహబూబ్‌నగర్ నుంచి దామోదరరెడ్డి స్థానంలో సింగర్‌ సాయిచంద్ కు అవకాశం ఇచ్చారు.