Asianet News TeluguAsianet News Telugu

ఎమ్మెల్సీ ఎన్నికలు: 12 మంది అభ్యర్థులను ఫైనల్‌ చేసిన కేసీఆర్ .. ఎవరనే దానిపై ఉత్కంఠ..!!

రేపు 12 మంది టీఆర్ఎస్ (trs) ఎమ్మెల్సీ (mlc elections) అభ్యర్ధులు నామినేషన్ వేయనున్నారు. ఎల్లుండితో స్థానిక సంస్థల (local body quota mlc)  ఎమ్మెల్సీ నామినేషన్‌ల గడువు ముగియనుంది. 12 మందిలో ఏడుగురు కొత్త వారికి అవకాశం దక్కనుంది

telangana cm kcr finalized trs party mlc candidates
Author
Hyderabad, First Published Nov 21, 2021, 6:32 PM IST

రేపు 12 మంది టీఆర్ఎస్ (trs) ఎమ్మెల్సీ (mlc elections) అభ్యర్ధులు నామినేషన్ వేయనున్నారు. ఎల్లుండితో స్థానిక సంస్థల (local body quota mlc)  ఎమ్మెల్సీ నామినేషన్‌ల గడువు ముగియనుంది. 12 మందిలో ఏడుగురు కొత్త వారికి అవకాశం దక్కనుంది. మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్, నల్గొండ, ఖమ్మంలో కొత్త వారికి ఛాన్స్ ఇచ్చారు. మహబూబ్ నగర్‌లో ఒకరికి , కరీంనగర్‌లో ఒకరికి కొత్తగా అవకాశం ఇచ్చారు  కేసీఆర్. బీసీలకు , ఓసీలకు 7, ఎస్సీలకు ఒక్క సీటును కేటాయించారు. ఎన్నికల బాధ్యతలను జిల్లా మంత్రులకు అప్పగించారు సీఎం. 

నిజామాబాద్‌లో కల్వకుంట్ల కవిత (kalvakuntla kavitha) సీటు మరొక మహిళలకు కేటాయించారు . అయితే ఈ 12 మంది సభ్యులు ఎవరనే దానిపై… సీఎం కేసీఆర్ వెల్లడించలేదు. ఎమ్మెల్సీ అభ్యర్థులను ప్రకటించకుండానే రేపు నామినేషన్లను దాఖలు చేయాలని గులాబీ బాస్ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం అందుతోంది. కెసిఆర్ నిర్ణయంతో టిఆర్ఎస్ శ్రేణుల్లో టెన్షన్ నెలకొంది. అసలు ఆ పన్నెండు మంది సభ్యులు ఎవరనే గందరగోళం అందరిలోనూ నెలకొంది. దీని పై క్లారిటీ రావాలంటే మరో 24 గంటలు ఆగాల్సిందే.

ALso Read:Telangana MLC: గవర్నర్ కోటా ఎమ్మెల్సీగా మధుసూదనాచారి.. ఆమోదం తెలిపిన గవర్నర్ తమిళిసై సౌందర్‌రాజన్

కాగా.. ఇటీవల గవర్నర్ కోటా ఎమ్మెల్సీగా శాసనసభ మాజీ స్పీకర్ సిరికొండ మధుసూదనాచారి (sirikonda madhusudhana chary) పేరును తెలంగాణ ప్రభుత్వం ప్రతిపాదించిన సంగతి తెలిసిందే. మంత్రుల సంతకాలతో గవర్నర్‌ తమిళిసై సౌందర్‌రాజన్‌కు.. రాష్ట్ర కేబినెట్ ప్రతిపాదన పంపింది. ఇందుకు గవర్నర్ తమిళిసై ఆమోదం తెలిపారు. గతంలో హుజురాబాద్ ఉప ఎన్నికకు ముందు టీఆర్‌ఎస్‌లో చేరిన పాడి కౌశిక్‌రెడ్డి (Padi Kaushik Reddy) పేరును ప్రభుత్వం.. గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా (governor quota mlc) ప్రతిపాదించింది. అయితే అందుకు గవర్నర్‌ ఆమోదం తెలుపకపోవడంతో.. పెండింగ్‌లో ఉంది. 

ఈ క్రమంలోనే కౌశిక్‌రెడ్డిని ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ తరఫున నామినేషన్ దాఖలు చేయించారు. ఈ నేపథ్యంలోనే గవర్నర్ కోటాలో పెండింగ్‌లో ఉన్న ఆ స్థానానికి.. మధుసూదనచారి పేరును ప్రతిపాదిస్తూ కేబినెట్ ప్రతిపాదన పంపింది. బుధవారమే ఈ ఫైల్ రాజ్‌భవన్‌కు చేరినట్టుగా తెలుస్తోంది. తాజాగా గవర్నర్ తమిళిసై ఆమోదంతో ఆయన శాసన మండలి సభ్యుడిగా మారారు. ఇక, ఇటీవల టీఆర్‌ఎస్ పార్టీ నుంచి ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థులుగా గుత్తా సుఖేందర్ రెడ్డి,  కడియం శ్రీహరి, తక్కళపల్లి రవీంద్రరావు, పాడి కౌశిక్ రెడ్డి, మాజీ కలెకర్ట్ వెంకట్రామిరెడ్డి, బండ ప్రకాష్‌లు నామినేషన్ దాఖలు చేశారు


 

Follow Us:
Download App:
  • android
  • ios