Asianet News TeluguAsianet News Telugu

సంగారెడ్డిలో ఐదు నెలల చిన్నారికి కరోనా పాజిటివ్..!

చిన్నారిని వైద్య పర్యవేక్షణలో ఉంచినట్లు  సంగారెడ్డి ఇన్ ఛార్జ్ డిస్ట్రిక్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్ గాయత్రీ దేవి పేర్కొన్నారు.

Five-month-old baby girl Covid positive in Sangarreddy
Author
Hyderabad, First Published Jun 12, 2021, 9:31 AM IST

ఐదు నెలల చిన్నారికి కరోనా పాజిటివ్ గా తేలింది. ఈ సంఘటన సంగారెడ్డిలో చోటుచేసుకోగా.. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.  సంగారెడ్డి జిల్లాలో ఇటీవల 2,037 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు. కాగా.. వారిలో 45 మందికి పాజిటివ్ గా తేలింది. కాగా.. వారిలో ఐదు నెలల చిన్నారి.. ఆమె పేరెంట్స్ కూడా ఉండటం గమనార్హం.

కాగా.. సంగారెడ్డి ప్రభుత్వాసుపత్రిలో కరోనా చికిత్స పొందుతూ తాజాగా ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. కాగా.. ఆ ఐదు నెలల చిన్నారి తల్లిదండ్రుల్లో ఇటీవల కరోనా లక్షణాలు కనిపించాయి. దీంతో.. వారు నారాయనఖేడ్ ప్రభుత్వాసుపత్రికి కరోనా పరీక్ష కోసం వెళ్లారు. ఆ సమయంలో చిన్నారికి కూడా జ్వరం రావడంతో.. ఆమెకు కూడా పరీక్ష నిర్వహించారు.

కాగా.. ఆ పరీక్షలో చిన్నారికి కూడా పాజిటివ్ గా తేలింది. అంత చిన్న పాపకు కరోనా పాజిటివ్ గా తేలడం.. తమ ప్రాంతంలో తొలిసారి అని అక్కడి అధికారులు తెలిపారు. చిన్నారిని వైద్య పర్యవేక్షణలో ఉంచినట్లు  సంగారెడ్డి ఇన్ ఛార్జ్ డిస్ట్రిక్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్ గాయత్రీ దేవి పేర్కొన్నారు.

ప్రస్తుతం చిన్నారి కుటుంబసభ్యులు మొత్తం ఐసోలేషన్ లో ఉన్నారు.  చిన్నారికి మాత్రం డ్రాప్స్ రూపంలో మెడికేషన్ అందిస్తున్నట్లు అధికారులు చెప్పారు.  

Follow Us:
Download App:
  • android
  • ios