ఉమ్మడి  వరంగల్  జిల్లాలోని  ఆరెపల్లి  బీసీ  హస్టల్  విద్యార్ధినుల  మధ్య  ఘర్షణ  చోటు  చేసుకొంది.  దీంతో  ఐదుగురు  విద్యార్ధినులు  శానిటైజర్  తాగి  ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించారు.    


వరంగల్: ఉమ్మడి వరంగల్ జిల్లాలోని అరెపల్లి బీసీ హస్టల్ విద్యార్ధినుల మధ్య ఆదివారంనాడు ఘర్షణ చోటు చేసుకుంది. దీంతో ఐదుగురు విద్యార్ధినులు శానిటైజర్ తాగి ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించారు. ఆత్మాహత్యాయత్నానికి ప్రయత్నించిన ఐదుగురు విద్యార్ధినులను వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు.

ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించిన ఐదుగురు విద్యార్ధినుల్లో ఓ విద్యార్ధిని పుట్టిన రోజు వేడుకలను నిన్న హస్టల్ నిర్వహించారు. ఈ వేడులకు బయటి నుండి ఒకరిద్దరూ హాజరయ్యారు.ఈ విషయం తెలిసిన హస్టల్ సిబ్బంది విద్యార్థినులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పుట్టిన రోజు వేడుకలు జరిగే సమయంలో చోటు చేసుకున్న ఓ ఘటన కూడ కూడా వివాదాన్ని మరింత పెద్దది చేసింది. దీంతో విద్యార్ధినులు ఘర్షణకు దిగారు. ఈ విషయంపై హస్టల్ సిబ్బంది విద్యార్ధినులను మందలించారు. దీంతో ఐదుగురు విద్యార్ధినులు శానిటైజర్ తాగారు. సహచర విద్యార్థినులు హస్టల్ సిబ్బందికి సమాచారం ఇచ్చారు.ఈ సమాచారం ఆధారంగా ఐదుగురు విద్యార్ధినులను ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. ఎంజీఎం ఆసుపత్రిలో విద్యార్ధినులకు వైద్యులు చికిత్స అందిస్తున్నారు. విద్యార్ధినుల ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు చెబుతున్నారు.