జంపన్న వాగులో గల్లంతు: ఎనిమిది మృతదేహల వెలికితీత
ములుగు జిల్లాలోని జంపన్న వాగులో గల్లంతైనఎనిమిది మంది మృతదేహలను ఎన్‌డీఆర్ఎఫ్ సిబ్బంది ఇవాళ వెలికితీశారు.
వరంగల్:ములుగు జిల్లాలోని జంపన్న వాగులో గల్లంతైన ఎనిమిది మంది మృతదేహలను శుక్రవారంనాడు వెలికి తీశారు. అజ్జు, షరీఫ్, మైబుఖాన్, మాజీద్, సమ్మక్క తో పాటు మరో మూడు మృతదేహలను వెలికి తీశారు. శుక్రవారం నాడు ఉదయం ఐదు మృతదేహలను వెలికి తీశారు. ఆ తర్వాత రెండు గంటల తర్వాత మూడు మృతదేహలను ఎన్‌డీఆర్ఎఫ్ సిబ్బంది ఇవాళ వెలికి తీశారు.
ములుగు జిల్లాలోని కొండాయి, మల్యాల గ్రామాల ప్రజలు ఎనిమిది మంది జంపన్నవాగులో కొట్టుకుపోయారు. నిన్నటి నుండి గాలింపు చర్యలు చేపట్టారు.కానీ ఎగువ నుండి భారీ వరద రావడంతో గాలింపు చర్యలకు ఇబ్బందులు ఏర్పడ్డాయి. ఇవాళ హెలికాప్టర్లను రప్పించారు. మరో వైపు వరద కొంత తగ్గడంతో ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది జంపన్న వాగులో మృతదేహలను వెలికితీశారు.
మరో వైపు కొండాయి, మల్యాల గ్రామాల్లో చిక్కుకున్న వంద మందిని హెలికాప్టర్ ద్వారా రక్షించనున్నారు. ఇవాళ మధ్యాహ్నం హెలికాప్టర్ ఈ ప్రాంతానికి వచ్చింది. ఈ హెలికాప్టర్ ద్వారా వరద భాదిత ప్రాంతాల ప్రజలను రక్షించనున్నారు.
తెలంగాణ రాష్ట్రంలోని ములుగు జిల్లాలో భారీ వర్షాలు నమోదయ్యాయి. గోదావరి పరివాహక ప్రాంతంలో భారీ వర్షాలు నమోదయ్యాయి. దీంతో గోదావరి పరివాహక ప్రాంత ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు పడ్డారు. ఈ వర్షాలతో జంపన్న వాగులో వరద పోటెత్తింది. జంపన్నవాగులో కొండాయి, మల్యాల గ్రామాలకు చెందిన ఎనిమిది మంది నిన్న కొట్టుకుపోయారు. ఇంకా ఈ రెండు గ్రామాలకు చెందిన వంద మందిని రక్షించేందుకు రెస్క్యూ చేస్తున్నారు.