ఆన్‌లైన్ లో గుర్రపు పందెల్లో ఎక్సైజ్ ఎస్ఐ సహా ఐదుగురిని అరెస్ట్ చేసినట్టుగా రాచకొండ సీపీ మహేష్ భగవత్ చెప్పారు. గుర్రపు పందెల్లో ఆస్తులు పోగోట్టుకొన్న జోజిరెడ్డి ఈ కేసులో కీలకపాత్రధారిగా ఉన్నాడని పోలీసులు చెప్పారు
హైదరాబాద్: online లో Horse పందెలు నిర్వహిస్తున్న ఐదుగురు సభ్యుల ముఠా సభ్యులను అరెస్ట్ చేశామని రాచకొండ సీపీ మహేష్ భగవత్ ప్రకటించారు. అయితే ఆన్ లైన్ గుర్రపు పందెల్లో ఎక్సైజ్ ఎస్ఐ అరెస్ట్ కూడా ఉన్నారని పోలీసుతు తెలిపారు.శుక్రవారం నాడు తన కార్యాలయంలో ఆన్ లైన్ గుర్రపు పందెం కేసుకు సంబంధించి సీపీ మీడియాకు వివరించారు.Joji Reddy అనే వ్యక్తి గుర్రపు పందెలు ఆడి తన ఆస్తులను పోగోట్టుకొన్నాడని సీపీ తెలిపారు తాను పోగోట్టుకొన్న ఆస్తిని తిరిగి దక్కించుకోవాలనే ఉద్దేశ్యంతో ఆన్ లైన్ గుర్రపు పందెలను జోజిరెడ్డి నిర్వహించాడని పోలీసులు చెప్పారు.
Whats app గ్రూపులను ఏర్పాటు చేసి ఆన్ లైన్ లో గుర్రపు పందెలు నిర్వహించారని సీపీ Mahesh Bhagwatచెప్పారు. 365 ఆన్ లైన్ ఆప్లికేషన్లలో గుర్రపు పందెలను నిర్వహించేవారని తాము గుర్తించామని పోలీసులు తెలిపారు. వాట్సాప్ గ్రూపుల్లో గుర్రపు పందెం సమాచారం ఎప్పటికప్పుడు చేరవేసేవారని పోలీసులు తెలిపారు. వాట్సాప్ గ్రూపుల్లో పంటర్స్ ను ఆకర్షిస్తూ Betting లునిర్వహిస్తున్నారని సీపీ మహేష్ భగవత్ చెప్పారు.
Hyderbad, బెంగుళూరు చెన్నైకోల్‌కత్తా, మైసూరులలో ఆన్ లైన్ రేసులు నిర్వహిస్తున్నారని తమ దర్యాప్తులో తేలిందన్నారు. ఈ కేసులో జోజిరెడ్డి సహా మరో నలుగురిని అరెస్ట్ చేశామన్నారు. 2020 నవంబర్ నుండి ఆన్‌లైన్ లో గుర్రపు పందెలను నిర్వహిస్తున్నామని పోలీసులు తెలిపారు.
నిందితుల నుండి రూ.42 లక్షల నగదు, 2 ల్యాప్ టాప్‌లు, ఐదు సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను రాచకొండ సీపీ మహేష్ భగవత్ వివరించారు.పట్టుబడ్డ నిందితుల్లో బొక్క మాధవ రెడ్డి అనే వ్యక్తి ఎక్సైజ్ డిపార్ట్ మెంట్ లో సబ్ ఇన్స్పెక్టర్ గా పనిచేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. బోయినపల్లికి చెందిన ప్రతాప్ రెడ్డి అనే వ్యక్తి పరారీలో ఉండగా అతని కోసం గాలిస్తున్నారు. నిందితులపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశామని పోలీసులు తెలిపారు. అనుమతి లేని ఆన్ లైన్ యాప్ ల ద్వారా బెట్టింగ్ లకు పాల్పడే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఈసందర్భంగా రాచకొండ పోలీసులు హెచ్చరించారు.
