హైదరాబాద్: చేపల వ్యాపారి రమేష్ హత్య కేసును పోలీసులు ఛేదించారు. ఈ కేసులో రమణమ్మ, శ్రీనివాసులు అనే ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గతంలో రమేష్ ఇంట్లోనే శ్రీనివాసులు అద్దెకు ఉన్నట్లు నిర్ధారణ అియంది. ఆర్థిక ఇబ్బందుల కారణంగా రమేష్ ను కిడ్నాప్ చేసి హత్య చేసినట్లు భావిస్తున్నారు. 

నాలుగు రోజుల క్రితం రమేష్ ను కిడ్నాప్ చేశారు. ఆ తర్వాత టేపుతో రమేష్ కాళ్లను కట్టేసి, గొంతు నులిమి చంపేశారు. నాలుగు రోజుల తర్వాత కుళ్లిన స్థితిలో రమేష్ మృతదేహం లభ్యమైంది. రమేష్ ను కిడ్నాప్ చేసిన తర్వాత రూ.90 లక్షలు డిమాండ్ చేశారు. బాధిత కుటుంబ సభ్యులు రూ.30 లక్షలు ఇస్తామని బేరమాడారు. ఈ స్థితిలో రమేష్ కిడ్నాపర్లు హత్య చేశారు. 

Also Read:మహిళ ఫోన్ తో బయటికి వచ్చిన చేపల వ్యాపారి కిడ్నాప్, హత్య

రమేష్ ను కిడ్నాప్ చేసిన సంఘటన హైదరాబాదులోని జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ దారుణం జరిగిన విషయం తెలిసిందే. ఈ నెల 1వ తేదీన గుర్తు తెలియని వ్యక్తులు అతన్ని కిడ్నాప్ చేశారని కుటుంబ సభ్యులు ఎస్ఆర్ నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు .

బోరబండలోని రామారావునగర్ లో నివాసం ఉంటున్న రమేష్ ను ఈఎస్ఐ ఆస్పత్రి సమీపంలో గుర్తు తెలియని వ్యక్తులు బలవంతంగా కారులో ఎక్కించుకుని తీసుకెళ్లారని ఆ ఫిర్యాదులో చెప్పారు. దీంతో పోలీసులు కేసు నమోదుచేసి గాలింపు చర్యలు చేపట్టారు. 

మంగళవారం సాయంత్రం ఓ ఇంట్లో అతని శవాన్ని గుర్తించారు. ఆ తర్వాత నిందితుల కోసం గాలిస్తున్నారు. ఈ నెల 1వ తేదీన రమేష్ ను కిడ్నాప్ చేసిన దుండగులు మర్నాడే అతన్ని హత్యచేసి గోనెసంచీలో చుట్టి పడేసినట్లు అనుమానిస్తున్నారు.