హైదరాబాద్ మేయర్ అలిగిండు

first citizen of Hyderabad Bontu is ignored in global entrepreneur summit
Highlights

  • ప్రొటోకాల్ వివాదాలు
  • మేయర్ ను పట్టించుకోని అధికారులు

ఆయన పుట్టి పెరిగింది వరంగల్ జిల్లాలో కావొచ్చు. ఉన్నత విద్య చదివింది ఉస్మానియాలో కావొచ్చు. ఇవన్నీ ఇప్పుడు అప్రస్తుతం.. ఎందుకంటే ఆయనిప్పుడు హైదరాబాద్ నగరానికి ప్రథమ పౌరుడు... ఆయనే మేయర్ బొంతు రామ్మోహన్. తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ తొలి మేయర్ కూడా ఆయనే. అయితే ఏం లాభం ఆయనకు టిఆర్ఎస్ ప్రభుత్వం మేయర్ పోస్టు ఇచ్చింది కానీ... మేయర్ కు ఇచ్చే ఇజ్జత్ మాత్రం ఇస్తలేదన్న బాధ, కసి ఆయనలో కనిపిస్తున్నాయి.. కారణం ఆయనను ప్రొటోకాల్ విషయంలో ఎప్పుడూ చిన్నచూపే చూస్తున్నారట. అసలు హైదరాబాద్ కు ప్రథమ పౌరుడు అనే ఒక మేయర్ ఉన్నాడన్న ముచ్చట కూడా ప్రొటోకాల్ అధికారులకు కలుగుతలేదట. అందుకే పాపం... హైదరాబాద్ మేయర్ బొంతు రామ్మోహన్ అలిగిండని చెబుతున్నారు.

హైదరాబాద్ కు ఎవరు ప్రముఖులు వచ్చినా వారిని ఆహ్వానించడంలో నగర మేయర్ ఉంటారు. దేశంలో రాజ్యాంగ హోదా కలిగిన రాష్ట్రపతి, ప్రధాని, ఉపరాష్ట్రపతి లాంటివాళ్లు హైదరాబాద్ వస్తే వారికి స్వాగతం పలకాల్సిన వ్యక్తి నగర మేయర్. మేయర్ తప్పక ఉండాలి. అది ప్రొటోకాల్.  గతంలో టీడీపీ.. కాంగ్రెస్ ప్రభుత్వాల్లో పనిచేసిన మేయర్లు వారు ప్రోటోకాల్లో ప్రథమ స్థానంలో ఉన్నారు. అప్పుడు ఆయా రాజకీయ పార్టీలు వారికి అంతగా గౌరవం ఇచ్చాయి. మరి తెలంగాణలో మాత్రం మేయర్ ను పట్టించుకోవడంలేదన్న విమర్శలు గుప్పమంటున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో గ్రేటర్ హైదరాబాద్ తొలి మేయర్ గా ఎన్నికలైన బొంతు రామ్మోహన్ ను మాత్రం ప్రోటో కాల్ పాటించకుండా అధికారులు అవమాన పరుస్తున్నారా?

నగరానికి రాష్ట్రపతి..ఉప రాష్ట్ర పతి ...ప్రధాని...విదేశీ అథితులు వచ్చిన నగరతొలి వ్యక్తిగా ఆహ్వానిస్తారు. కాని ప్రస్తుతం హైదరాబాద్ మేయర్ బొంతు రామ్మోహన్ పేరును ప్రోటోకాలో లిస్టులు 20-30 పేర్ల తర్వాత లిస్టులో పెడుతున్నారని చబుతున్నారు.  మొన్నటికి మొన్న హకీం పేటకు రాష్ట్రపతి వస్తే అధి గ్రేటర్ హైదరాబాద్ పరిధి కాదంటున్నారు. శంషాబాద్ వచ్చినా అదే పరిస్థితి ఉంది. ప్రస్తుతం జీఈఎస్ సదస్సుకు ప్రపంచ స్థాయి ప్రతినిధులు వస్తున్నా మేయర్ కు ఆహ్వానం లేదు. దీంతో గత ఏడాది కాలంగా ఏ పర్యటనకు కూడా బొంతు వెళ్లకుండా ఉంటున్నట్లు ఆయన సన్నిహితులు చెబుతున్నారు. జీఈఎస్ సదస్సుకు వందల కోట్లు జీహెచ్ఎంసీ ఖర్చు చేస్తున్నా బల్దియా మేయర్ కు అక్కడ స్థానం లేదపోవడం సరికాదంటున్నారు.

రాష్ట్ర స్థాయి ప్రోటోకాల్ అధికారి అధార్ సిన్హా వ్యవహారంపై విమర్శలు గుపుమంటున్నాయి. గంతలో పనిచేసిన టీడీపీ..కాంగ్రెస్...ఎంఐఎం మేయర్ల కు ఇలా జరిగిన దాఖలాలు లేవని చెబుతున్నారు. మేయర్ స్థానాన్నే అవమాన పరుస్తున్నారనే ఆరోపణలు వస్తున్నారు. మెట్రో ఓపెనింగ్ విషయంలోనూ మేయర్ పట్ల చిన్నచూపే ఉందని చెబుతున్నారు. మెట్రో ఆవిష్కరణ శిలాపలకం పై మేయర్ పేరు ఎక్కడా కన్పించలేదని ఆయన సన్నిహితులు బాధపడుతున్నారు. ఈ పరిణామాలపై మేయర్ బొంతు రామ్మోహన్ అలిగినట్లు చెబుతున్నారు. మరి ఈ వ్యవహారాలపై టిఆర్ఎస్ తోపాటు రాజకీయ పార్టీల్లో జోరుగా చర్చలు నడుస్తున్నాయి.

మేయర్ ను అవమాన పర్చారని కాంగ్రెస్ ఎమ్మెల్యే డికెఆరుణ కూడా ఆరోపించారు. అరుణ ఏమన్నారో చూడండి:

https://goo.gl/Pzzkum

loader