హైదరాబాద్ పోలీసులపై బీహార్ లో కాల్పులు.. సైబర్ నేరగాళ్ల ఘాతుకం..
హైదరాబాద్ పోలీసుల మీద బీహార్ లో కాల్పులు జరగడం కలకలం రేపింది. నలుగురు నిందితులు తమను పట్టుకున్న పోలీసుల మీద కాల్పులు జరిపి పరారయ్యారు.
హైదరాబాద్ : సైబర్ క్రైమ్ కేసులో నేరస్తులైన కొందరిని బీహార్ నుంచి నగరానికి తీసుకు వస్తుండగా ఆదివారం సాయంత్రం అక్కడి నేరగాళ్లు సైబరాబాద్ పోలీసులపై కాల్పులకు తెగబడ్డారు. బీహార్ కి చెందిన మిథిలేశ్ అనే వ్యక్తి తన గ్యాంగ్ తో కలిసి సైబర్ నేరాలకు పాల్పడి నగరంలోని పలువురు నిండా ముంచాడు. దీంతో విచారణ చేపట్టిన పోలీసులు ఈనెల 11న బీహార్లోని నవాడాకు వెళ్లారు.
నేరగాళ్లు అక్కడే ఉన్నట్లు గుర్తించి, నలుగురిని అరెస్టు చేసి తీసుకు వస్తుండగా వారు పోలీసులపై కాల్పులు జరిపి పారిపోయారు ఈ ఘటనలో పోలీసులు సురక్షితంగా తప్పించుకున్నారు. కాగా అప్పటికే పోలీసులు మిథిలేశ్ నుంచి రూ.1.22 కోట్లు నగదు, 3 లగ్జరీ కార్లు, 5 ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.
మహేశ్ భగవత్, దేవేంద్ర సింగ్‌లకు రాష్ట్రపతి పోలీస్ మెడల్స్
ఇలా ఉండగా, స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు సిద్ధమవుతున్న వేళ పంజాబ్ లో ఉగ్ర ముఠా కలకలం రేపింది. పాకిస్థాన్కు చెందిన ఐఎస్ఐ మద్దతుదారుల కుట్రలను భగ్నం చేసిన పోలీసులు.. నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి 3 హ్యాండ్ గ్రనేడ్లు, ఒక ఐఈడి, రెండు పిస్టళ్లు, 40 క్యాట్ట్రిడ్జులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఆపరేషన్ ను పంజాబ్-ఢిల్లీ పోలీసులు సంయుక్తంగా నిర్వహించారు.
‘స్వాతంత్ర దినోత్సవ వేడకల వేళ పంజాబ్ పోలీసులు భారీ ఉగ్రకుట్రను భగ్నం చేశాం. పాకిస్థాన్కు చెందిన ఐఎస్ఐ మద్దతు కలిగిన నలుగురు ఉగ్రవాదులను ఢిల్లీ పోలీసుల సహకారంతో అదుపులోకి తీసుకున్నాం. కెనడాకు చెందిన అర్ష్ డల్లా, ఆస్ట్రేలియాకు చెందిన గుర్జంత్ సింగ్ తో సంబంధం ఉన్న నలుగురిని అరెస్టు చేశాం’ అని అని పంజాబ్ పోలీస్ ట్విట్టర్లో వెల్లడించారు. ఆ ముఠా నుంచి 3 హ్యాండ్ గ్రనేడ్లు (పి-86), ఐఈడీ, రెండు 9ఎం.ఎం. పిస్టళ్లు, 40 క్యాట్రిడ్జ్ లు సీజ్ చేసినట్టు పేర్కొన్నారు. సోమవారం స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు జరుగుతున్న వేళ పంజాబ్ లో భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు.