హైద్రాబాద్ నగరంలో ని ఎర్రగడ్డ  రాజ్ మినరల్ వర్క్స్  గోదాంలో  శుక్రవారం నాడు  అగ్ని ప్రమాదం  చోటు  చేసుకుంది.

హైదరాబాద్: నగరంలోని ఎర్రగడ్డ రాజ్ మినరల్ వర్క్స్ గోదాంలో శుక్రవారం నాడు అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. విషయాన్ని గుర్తించిన స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చారు. రెండు ఫైరింజన్లు మంటలను ఆర్పుతున్నాయి. 

ఈ గోదాం పక్కనే అపార్ట్ మెంట్ ఉంది. అపార్ట్ మెంట్ లో నివాసం ఉంటున్న స్థానికులు ఆందోళనలు చెందుతున్నారు. ఈ అగ్ని ప్రమాదం కారణంగా ఎర్రగడ్డ వద్ద భారీగా ట్రాఫిక్ జామ్ నెలకొంది. దీంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు.