సికింద్రాబాద్ :రైల్ నిలయం పాత క్వార్టర్స్‌లో అగ్నిప్రమాదం.. భారీగా ఎగసిపడుతున్న మంటలు
సికింద్రాబాద్ రైల్ నిలయం పాత క్వార్టర్స్‌లో అగ్నిప్రమాదం సంభవించింది. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక శాఖ సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపు చేస్తున్నారు.

సికింద్రాబాద్ రైల్ నిలయం పాత క్వార్టర్స్‌లో అగ్నిప్రమాదం సంభవించింది. గుర్తు తెలియని వ్యక్తులు ఆ ప్రాంతంలో చెత్తకు నిప్పు పెట్టడంతో మంటలు ఎగిసిపడినట్లుగా తెలుస్తోంది. దీంతో ఈ ప్రాంతంలో భారీగా మంటలు ఎగిసిపడుతున్నాయి. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక శాఖ సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపు చేస్తున్నారు. అయితే ఈ ప్రాంతంలో ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది.