హైదరాబాద్ షేక్ పేట్ లోని పెట్రోల్ బంకులో అగ్నిప్రమాదం జరిగింది. కారులో పెట్రోల్ నింపుతుండగా ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. క్షణాల్లోనే మంటలు వ్యాపించాయి. భారీగా ఎగిసిపడుతున్నాయి. పెట్రోల్ బంకులోనే కారు మంటల్లో తగలబడుతోంది. కారు పూర్తిగా దగ్ధమైంది. సిబ్బంది, వాహనదారులు, స్థానికులు భయంతో పరుగులు తీశారు. మంటలు ఎగిసిపడుతుండటంతో ఏం జరుగుతుందోనని స్థానికులు భయాందోళకు గురయ్యారు. 

మంటలు చెలరేగడంతో పెట్రోల్ బంకులో దట్టమైన పొగ ఆవరించింది. రంగంలోకి దిగిన ఫైర్ సిబ్బంది మంటలు ఆర్పివేసింది. దీంతో పెను ప్రమాదం తప్పినట్టు అయ్యింది. రెండు ఫైర్ ఇంజిన్ లతో దాదాపు 20నిమిషాలపాటు మంటలు అదుపుచేసేందుకు ప్రయత్నించారు. ఎలాంటి ప్రాణ నష్టం చోటుచేసుకోకపోవడంతో... అందరూ ఊపిరితీర్చుకున్నారు.