హైదరాబాద్‌లోని చాదర్‌ఘాట్ (chaderghat) ప్రాంతంలో శుక్రవారం భారీ అగ్ని ప్రమాదం (Fire Accident) చోటుచేసుకుంది. మూసీ ఒడ్డున ఒక గుడిసెలో మంటలు చెలరేగాయి. క్షణాల్లోనే మంటలు పక్కన ఉన్న గుడిసెలకు వ్యాపించాయి.
హైదరాబాద్‌లోని చాదర్‌ఘాట్ (chaderghat) ప్రాంతంలో శుక్రవారం భారీ అగ్ని ప్రమాదం (Fire Accident) చోటుచేసుకుంది. మూసీ ఒడ్డున ఒక గుడిసెలో మంటలు చెలరేగాయి. క్షణాల్లోనే మంటలు పక్కన ఉన్న గుడిసెలకు వ్యాపించాయి. భారీగా మంటలు చెలరేగడంతో పెద్ద సంఖ్యలో గుడిసెలు అగ్నికి ఆహుతైనట్టుగా తెలుస్తోంది. అగ్ని ప్రమాదం ధాటికి గుడిసెల్లో ఉన్న 2 సిలిండర్లు పేలాయి. సిలిండర్లు పేలడంతో ప్రజలు భయంతో పరుగులు తీవారు. ఈ ఘటనపై మాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటన స్థలానికి చేరుకున్నారు. ఐదు అగ్నిమాపక యంత్రాలతో మంటలను అదుపులోకి తీసుకొచ్చారు.
అయితే ఈ ప్రమాదంలో ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదని సమాచారం. కాలి బూడిదైన గుడిసెల్లోనే నిత్యావసరాలు, ఇతర వస్తువులు ఉండటంతో ఆస్తి నష్టం మాత్రం చోటుచేసుకుంది. దీంతో గుడిసెల్లో నివాసం ఉండేవారంతా కట్టుబట్టలతో రోడ్డు మీదపడ్డారు.
