సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రిలో అగ్నిప్రమాదం జరిగింది. మూడవ అంతస్తులోని చిన్నపిల్లల వార్డులో షార్ట్ సర్క్యూట్‌ కారణంగా మంటలు చెలరేగాయి. దీంతో 3వ అంతస్తులో దట్టమైన పొగలు వ్యాపించాయి. దీంతో రోగులు, సిబ్బంది భయాందోళనలకు గురయ్యారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది గాంధీ ఆసుపత్రికి చేరుకుని మంటలను ఆర్పివేశారు. మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది.