చర్లపల్లి పారిశ్రామిక వాడలో బుధవారం తెల్లవారుజామున అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. స్థానికంగా ఉన్న ఎరువులు, రసాయన పరిశ్రమలో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. క్షణాల్లోనే ఫ్యాక్టరీ మొత్తం మంటలు వ్యాపించాయి.

ఆ వెంటనే కెమికల్ ఫ్యాక్టరీ నుంచి పక్కనే వున్న మరో పరిశ్రమకు మంటలు అంటుకున్నాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని ఐదు అగ్నిమాపక యంత్రాలతో సిబ్బంది మంటలను అదుపు చేస్తున్నారు.

ఈ ప్రమాదంలో రూ.50 లక్షలకు పైగా ఆస్తినష్టం సంభవించి వుంటుందని అధికారులు చెబుతున్నారు. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి వుంది.