హైదరాబాద్‌ ఔటర్ రింగ్ రోడ్‌పై పెను ప్రమాదం తప్పింది. రోడ్డుపై వెళుతున్న టయోటా కారులో హిమాయత్ సాగర్ సమీపానికి రాగానే మంటలు చెలరేగాయి. కారులో ప్రయాణిస్తున్న వారు వెంటనే వీటిని పసిగట్టి కిందకు దిగేశారు. 

హైదరాబాద్‌ ఔటర్ రింగ్ రోడ్‌పై పెను ప్రమాదం తప్పింది. రోడ్డుపై వెళుతున్న టయోటా కారులో హిమాయత్ సాగర్ సమీపానికి రాగానే మంటలు చెలరేగాయి. కారులో ప్రయాణిస్తున్న వారు వెంటనే వీటిని పసిగట్టి కిందకు దిగేశారు. అయినప్పటికీ ఒకరికి గాయాలయ్యాయి.

ప్రమాదాన్ని గమనించిన తోటి వాహనదారులు అతన్ని ఆసుపత్రికి తరలించారు. మంటల ధాటికి కారు పూర్తిగా దగ్థమైపోయింది. సమాచారం అందుకున్న పోలీసులు.. అగ్నిమాపక సిబ్బంది సాయంతో మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. 

"