హైదరాబాద్ బిర్యానీకి పేరుగాంచిన హోటళ్లలో బావార్చి బిర్యానీ హౌస్ ఒకటి. పేద, మధ్య తరగతి ప్రజానీకానికి ఈ రెస్టారెంట్ లో ధరలు అందుబాటులో ఉంటాయి. అందుకే వేల సంఖ్యలో ఇక్కడికి వచ్చి బిర్యానీ తినేందుకు జనాలు ఇస్టపడుతుంటారు. కానీ గురువారం ఆ హోటల్ లో ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. పెద్ద మంటలు రావడంతో జనాలు భయాందోళనకు గురయ్యారు.

హైదరాబాద్ బిర్యానీకి పేరుగాంచిన హోటళ్లలో బావార్చి బిర్యానీ హౌస్ ఒకటి. పేద, మధ్య తరగతి ప్రజానీకానికి ఈ రెస్టారెంట్ లో ధరలు అందుబాటులో ఉంటాయి. అందుకే వేల సంఖ్యలో ఇక్కడికి వచ్చి బిర్యానీ తినేందుకు జనాలు ఇస్టపడుతుంటారు.
తాజాగా గురువారం మధ్యాహ్నం ఒక్కసారిగా బావార్చి హోటల్ లో మంటలు చెలరేగాయి. ఆ హోటల్ లో నుంచి భారీగా మంటలు రావడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. ఆ మంటలతో అక్కడి పరిసరాలన్నీ నల్లని పొగ కమ్మకుంది.
హోటల్ ముందు రోడ్డులో జనాల రాకపోకలను ఆపేశారు. అయితే కిచెన్ లో వచ్చిన మంటలు బిల్డింగ్ అంతటికీ వ్యాపించిందా మరేదైనా కారణం ఉందా వివరాలు తెలియాల్సి ఉంది.
