హైదరాబాద్ : అంకుర ఆసుపత్రిలో భారీ అగ్నిప్రమాదం.. హాస్పిటల్‌లో గర్భిణీలు, చిన్నారులు
హైదరాబాద్ గుడిమల్కాపూర్ అంకుర ఆసుపత్రిలో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. సమాచారం అందుకున్న అగ్నిమాపక శాఖ సిబ్బంది, పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. 4 ఫైరింజిన్లు తీవ్రంగా శ్రమించి మంటలను అదుపులోకి తెచ్చాయి.
హైదరాబాద్ గుడిమల్కాపూర్ అంకుర ఆసుపత్రిలో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. సమాచారం అందుకున్న అగ్నిమాపక శాఖ సిబ్బంది, పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. 4 ఫైరింజిన్లు తీవ్రంగా శ్రమించి మంటలను అదుపులోకి తెచ్చాయి. ఆసుపత్రి భవనంలో పెద్ద ఎత్తున మంటలు ఎగసిపడుతుండటంతో సహాయక చర్యలకు ఆటంకం కలిగింది. అగ్ని ప్రమాద ఘటనతో అప్రమత్తమైన ఆసుపత్రి సిబ్బంది రోగులను బయటకు తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు.
ఇందులో అంతా చిన్నారులు, గర్భిణీ స్త్రీలు వుండటంతో వారిని బయటకు తరలించారు. అగ్ని ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి వుంది. తొలుత ఆరో అంతస్తులో మొదలైన మంటలు క్రమంగా తొలి అంతస్తు వరకు చేరుకున్నాయి. హాస్పిటల్ నేమ్ బోర్డుకు మంటలు అంటుకోగా.. పక్కనే వున్న ఫ్లెక్సీలకు వ్యాపించాయి. షార్ట్ సర్క్యూట్ కారణంగానే మంటలు అంటుకున్నట్లుగా పోలీసులు భావిస్తున్నారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది.