ప్రముఖ హీరో నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna), దర్శకుడు బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో తెరకెక్కిన అఖండ (Akhanda) చిత్రం నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఈ చిత్రం ప్రదర్శితమవుతున్న ఓ థియేటర్‌లో అగ్ని ప్రమాదం చోటుచేసుకోంది. 

ప్రముఖ హీరో నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna), దర్శకుడు బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో తెరకెక్కిన అఖండ (Akhanda) చిత్రం నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. దీంతో తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రం ప్రదర్శితమవుతున్న థియేటర్ల వద్ద సందడి చోటుచేసుకుంది. బాలయ్య అభిమానులు అయితే పండగ చేసకుంటున్నారు. అయితే అఖండ చిత్రం ప్రదర్శితమవుతున్న ఓ థియేటర్‌లో అగ్ని ప్రమాదం చోటుచేసుకోంది. దీంతో ఆందోళన చెందిన ప్రేక్షకులు.. భయంతో బయటకు పరుగులు తీశారు. ఈ ఘటన తెలంగాణలోని వరంగల్ జిల్లాలో చోటుచేసుకుంది. 

వరంగల్‌లో ఏసియన్ జెమిని థియేటర్‌లో (Asian Gemini Theatre) గురువారం అఖండ సినిమా ప్రదర్శిస్తుండగా ఒక్కసారిగా అగ్నిప్రమాదం సంభవించింది. సినిమా చూస్తుండగానే పొగలు రావడంతో ప్రేక్షకులు భయాందోళన చెందారు. వెంటనే థియేటర్‌ నుంచి బయటకు పరుగులు తీశారు. మరోవైపు అప్రమత్తమైన థియేటర్ యజమాన్యం వెంటనే అగ్ని మాపక సిబ్బందికి సమాచారం అందించిది. దీంతో అక్కడికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేశారు. 

Also read: బాలయ్య ‘అఖండ’రివ్యూ

అయితే షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటల చెలరేగి ఉంటాయని అనుమానిస్తున్నారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు కూడా అక్కడికి చేరుకుని వివరాలు ఆరా తీశారు. అయితే ఇందుకు సంబంధించిన వాస్తవ కారణాలు మాత్రం తెలియాల్సి ఉంది. అయితే సినిమా థియేటర్ యజమాన్యాలు ఇలాంటి ఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ప్రేక్షకులు కోరుతున్నారు.