Asianet News TeluguAsianet News Telugu

హైదరాబాద్ : నీలోఫర్ ఆసుపత్రిలో అగ్నిప్రమాదం.. పరుగులు తీసిన రోగులు, సిబ్బంది

హైదరాబాద్ నీలోఫర్ ఆసుపత్రిలో బుధవారం అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. సమాచారం అందుకున్న పోలీస్, అగ్నిమాపక శాఖ సిబ్బంది ఘటనాస్ఠలికి చేరుకుని మంటలను అదుపు చేశారు. ఈ ఘటనతో చిన్నారులు, వారి తల్లిదండ్రులు, ఆసుపత్రి సిబ్బంది భయభ్రాంతులకు గురై పరుగులు తీశారు.

fire accident at niloufer hospital hyderabad ksp
Author
First Published Feb 7, 2024, 5:47 PM IST | Last Updated Feb 7, 2024, 5:47 PM IST

హైదరాబాద్ నీలోఫర్ ఆసుపత్రిలో బుధవారం అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. మొదటి అంతస్తులోని ల్యాబ్‌లో షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగాయి. చూస్తుండగానే క్షణాల్లో ఆ ప్రాంతమంతా మంటలు విస్తరించడంతో పాటు దట్టంగా పొగ వ్యాపించింది. సమాచారం అందుకున్న పోలీస్, అగ్నిమాపక శాఖ సిబ్బంది ఘటనాస్ఠలికి చేరుకుని మంటలను అదుపు చేశారు. ఈ ఘటనతో చిన్నారులు, వారి తల్లిదండ్రులు, ఆసుపత్రి సిబ్బంది భయభ్రాంతులకు గురై పరుగులు తీశారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios