సంగారెడ్డి: సంగారెడ్డి జిల్లాలోని పాశ మైలారంలోని ఓ కెమికల్ ఫ్యాక్టరీలో శనివారం ఉదయం అగ్ని ప్రమాదం చోటు చేసుకొంది. ప్రమాద సమయంలో ఫ్యాక్టరీలో ఎవరూ లేరు. ఆరు ఫైరింజన్లు మంటలను ఆర్పుతున్నాయి.

పాశ మైలారం పారిశ్రామిక వాడలో పలు ఫ్యాక్టరీలు ఉన్నాయి.  కెమికల్ ఫ్యాక్టరీలో ప్రమాదవశాత్తు మంటలు చెలరేగాయి.ఈ మంటలు చుట్టుుపక్కలకు వ్యాపించాయి. దీంతో స్థానికులు భయాందోళనలకు గురయ్యారు. స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చారు. దీంతో ఆరు ఫైరింజన్లు మంటలను ఆర్పుతున్నాయి.

ఈ ప్రమాదం జరిగడానికి గల కారణాలను అధికారులు అన్వేషిస్తున్నారు. ఈ ఫ్యాక్టరీ నుండి మంటలు పక్కనే ఉన్న మరో రెండు ఫ్యాక్టరీలకు కూడ వ్యాపించాయి.