హైదరాబాద్: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డా.కె.లక్ష్మణ్ తో ప్రముఖ సినీనటుడు, దర్శకుడు ఆర్ నారాయణ మూర్తి కలిశారు. ఆర్. నారాయణమూర్తి దర్శకత్వం వహించి నటిస్తున్న మార్కెట్లో ప్రజాస్వామ్యం మూవీ ప్రీమియర్ షో ప్రసాద్ ల్యాబ్స్ లో ప్రదర్శిస్తున్న నేపథ్యంలో సినిమాను తిలకించాలంటూ కోరారు. 

అనంతరం ఇరువురు తాజా రాజకీయ పరిణామాలపై చర్చించారు. ప్రస్తుతం రాజకీయ వ్యవస్థలో నెలకొన్న అంశాలు, ప్రజా వ్యవస్థ పట్ల రాజకీయ నాయకులు వ్యవహరిస్తున్న తీరుపై చిత్రాన్ని తెరకెక్కించినట్లు తెలిపారు. 

ప్రతీ రాజకీయ నాయకుడు సినిమాను చూడాల్సిన అవసరం ఉందని తప్పనిసరిగా చూడాలని ఆర్ నారాయణ మూర్తి కోరారు. మార్కెట్లో ప్రజాస్వామ్యం ప్రీమియర్ షోకు తప్పనిసరిగా హాజరవుతానని లక్ష్మణ్ హామీ ఇచ్చారు.