మంచిర్యాల జిల్లాలో టీఆర్ఎస్, బీజేపీ నేతల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. జీఎస్టీ పెంపుపై టీఆర్ఎస్ ఆందోళన చేస్తుంటే.. ముందు వరద బాధితులను ఆదుకోవాలంటూ బీజేపీ నేతలు నిరసనకు దిగారు.
మంచిర్యాల జిల్లాలో టీఆర్ఎస్, బీజేపీ నేతల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. కర్రలు, చెప్పులతో పరస్పరం దాడులు చేసుకున్నారు ఇరుపక్షాల నేతలు. వరద బాధితులను ఆదుకోవాలని బీజేపీ నిరసన వ్యక్తం చేసింది. అయితే ఎమ్మెల్యే దివాకర్ గో బ్యాక్ అంటూ బీజేపీ మరో పక్క నిరసన తెలియజేసింది. అయితే ఇరు వర్గాల నేతలకు మధ్య తోపులాట చోటు చేసుకోవడంతో మహిళా బీజేపీ నేత కిందపడిపోయారు. జీఎస్టీ పెంపుపై టీఆర్ఎస్ ఆందోళన చేస్తుంటే.. ముందు వరద బాధితులను ఆదుకోవాలంటూ బీజేపీ నేతలు నిరసనకు దిగారు. వెంటనే పోలీసులు రంగ ప్రవేశం చేసి ఇరుపక్షాలను చెదరగొట్టారు. ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో పోలీసులు భారీగా మోహరించారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది.
