Asianet News TeluguAsianet News Telugu

పోడు భూముల రగడ : ఫారెస్ట్ అధికారులను వేటకొడవళ్లతో వెంటాడి నరికిన గుత్తికోయలు

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఉద్రిక్తత పరిస్ధితి చోటు చేసుకుంది. పోడుభూముల్లో మొక్కలు పెంచడాన్ని నిరసిస్తూ ఫారెస్ట్ అధికారులపై గుత్తి కోయలు దాడి చేశారు. 

fighting between forest officers and tribals in bhadradri kothagudem district
Author
First Published Nov 22, 2022, 3:35 PM IST

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఫారెస్ట్ అధికారులపై గుత్తికోయలు దాడి చేశారు. చండ్రగుంట మండలం బెండలపాడులో ఈ ఘటన జరిగింది. ఫారెస్ట్ రేంజర్ శ్రీనివాస్‌ను వెంటాడి వేట కొడవళ్లతో దాడి చేశారు. తీవ్ర గాయాలతో రక్తపు మడుగులో కొట్టుమిట్టాడుతోన్న శ్రీనివాస్‌ను హుటాహుటిన కొత్తగూడెం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. శ్రీనివాసరావు పరిస్ధితి ప్రస్తుతం విషమంగా వున్నట్లుగా తెలుస్తోంది. దీంతో ఆయనను కొత్తగూడెం నుంచి ఖమ్మం ప్రభుత్వాసుపత్రికి తరలించే ప్రయత్నాలు చేస్తున్నారు. 

ALso REad:భద్రాద్రి కొత్తగూడెంలో పోడు వివాదం: అటవీ శాఖాధికారులను అడ్డుకున్న గాండ్లగూడెం వాసులు

బెండలపాడు సమీపంలోని ఎర్రగూడు అటవీప్రాంతంలో గతంలో పోడు వ్యవసాయం చేసుకుంటున్న గిరిజనుల భూముల్లో ఫారెస్ట్ అధికారులు మొక్కలు నాటారు. ఈ నాటిన మొక్కల్ని తొలగించడానికి గిరిజనులు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ విషయంలో పలుమార్లు ఫారెస్ట్ అధికారులకు, పోడు రైతులకు మధ్య గొడవ జరిగింది. గతంలో లాఠీఛార్జ్ సైతం చేశారు. తాజాగా ఫారెస్ట్ అధికారులు ప్లాంటేషన్ చేయడాన్ని నిరసిస్తూ ఇవాళ మళ్లీ భూముల్లో అధికారులను నాటిన మొక్కల్ని ధ్వంసం చేశారు గుత్తికోయలు. దానిని అడ్డుకునే క్రమంలో అధికారులు, గిరిజనులకు మధ్య వాగ్వాదం జరిగింది.  ఫారెస్ట్ రేంజర్ శ్రీనివాసరావుపై గిరిజనులు వేట కొడవళ్లతో దాడులు చేశారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది. 

Follow Us:
Download App:
  • android
  • ios