కూకట్ పల్లిలో టీడీపీ ప్రచారంలో వివాదం చోటుచేసుకుంది. మహాకూటమిలో భాగంగా టీడీపీ  కూకట్ పల్లి అభ్యర్థిగా సుహాసినికి టికెట్ కేటాయించిన సంగతి తెలిసిందే. కాగా.. ఆమె నామినేషన్ వేసిన నాటి నుంచి కూకట్ పల్లిలో విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. ఆమెతోపాటు టీడీపీ శ్రేణులు కూడా ప్రచారంలో పాల్గొంటున్నాయి.

రోజూలాగానే బుధవారం కూడా టీడీపీ నేతలు కూకట్ పల్లిలోని అల్విన్ కాలినీలో  ప్రచారం చేస్తుండగా.. టీఆర్ఎస్ నేతలు అడ్డుకున్నారు. టీఆర్ఎస్ కి చెందిన స్థానిక కార్పొరేటర్..వెంకటేష్ గౌడ్ టీడీపీ నేతల ప్రచారానికి అడ్డుగా నిలబడి.. వారిపై ప్రశ్నల వర్షం కురిపించారు. ఈ విషయంలో ఆగ్రహం వ్యక్తం చేసిన టీడీపీ నేతలు వెంకటేష్ పై దాడి చేశారు. ఈ క్రమంలో మాటామాటా పెరిగి.. టీడీపీ, టీఆర్ఎస్ నేతలు కొట్టుకునే దాకా దారితీసింది.

సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకొని పరిస్థితిని చక్కదిద్దారు. టీడీపీ, టీఆర్ఎస్ నేతలతో మాట్లాడి వారిని శాంతింపచేశారు. అనంతరం ఎవరి ప్రచారం వారు కొనసాగించారు. 

read more news

నందమూరి సుహాసినికి షాక్...ప్రచారానికి రానన్న భువనేశ్వరి

సుహాసిని కోసం ఎన్నికల ప్రచారానికి ఏపీ మంత్రి సునీత

నందమూరి సుహాసిని తలుపుతట్టిన అదృష్టం...ఎలా అంటే