పసందైన చికెస్ బిర్యానీ అంటే ఇష్టపడని వారు ఎవరుంటారు చెప్పండి. కానీ బిర్యాని  కోసం బార్యనే వదిలేసేంత కాదు కదండి. ఏంటి చికెన్ బిర్యాని కోసం బార్యను వదిలేయడం ఏమిటి, అసలు ఎక్కడ జరిగిందీ సంఘటన అనుకుంటున్నారా అయితే ఈ స్టోరి మీరు చదవాల్సిందే.
వరంగల్ అర్బన్ జిల్లా ఇల్లందుకు చెందిన కూరపాటి రాజేంద్రప్రసాద్‌ కు వర్ధన్నపేటకు చెందిన మానసతో ఏడాది క్రితం వివాహం జరిగింది. అయితే మద్యానికి బానిపైన రాజేంద్రప్రసాద్ బార్యతో తరచూ గొడవపడేవాడు. ఈ క్రమంలోనే ఓ రోజు బాగా తాగి వచ్చి బార్యతో బిర్యాని చేయించుకున్నాడు. అయితే ఆమె చేసిన బిర్యాని నచ్చలేదని, ఇది కూడా చేయడం చేతకాదా అంటూ గొడవకు దిగాడు. ఈ గొడవను అదునుగా చేసుకుని బార్యను పుట్టింటికి పంపించాడు.
భర్త కోపం తగ్గాక వస్తాడని ఏడాది నుంచి ఎదురుచూసి విసుగు చెందిన మానస పోలీసులను ఆశ్రయించింది. వారి నుంచి సహకారం లేకపోవడంతో ఆమె తన తల్లిదండ్రులతో కలిసి భర్త ఇంటిముందు దర్నాకు దిగింది.