సిద్ధిపేట జిల్లా అక్బర్‌పేట్ భూంపల్లిలో టీఆర్ఎస్ బీజేపీ కార్యకర్తలు ఘర్షణకు దిగారు. ఎమ్మార్వో కార్యాలయ ప్రారంభోత్సవం సందర్భంగా ఈ ఘటన జరిగింది. 

సిద్ధిపేటలో కొత్తగా నిర్మించిన అక్బర్‌పేట్ భూంపల్లి ఎంఆర్‌వో కార్యాలయం ఉద్రిక్తతలకు దారి తీసింది. ప్రారంభోత్సవానికి మంత్రి హరీశ్ రావుతో పాటు మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు హాజరయ్యారు. అయితే బీజేపీ , టీఆర్ఎస్ కార్యకర్తలు పోటీపోటీ నినాదాలు చేశారు. తర్వాత ఇరు పార్టీల కార్యకర్తల మధ్య తోపులాట జరిగింది. అయితే అక్కడే వున్న పోలీసులు ఇరువర్గాలకు నచ్చజెప్పి పరిస్ధితిని అదుపులోకి తీసుకొచ్చారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది. 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred