Asianet News TeluguAsianet News Telugu

ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను మింగేసిన అధికారులు

విద్యాసంవత్సరం గడుస్తున్న ఈ సమయంలో ఫీజు రీయింబర్స్ మెంట్ లోని మరో గోల్ మాల్ తాజాగా వెలుగు చూసింది.

fee reimbursement scam treasury officer arrested

ఫీజు రీయింబర్స్ మెంట్ పథకం పక్కదారులు పడుతోంది. కొత్త కొత్త స్కాంలు ఇందులో వెలుగు చూస్తున్నాయి. గతంలో ఫీజు రీయింబర్స్ మెంట్ కోసమే కొన్ని కళాశాలలు రాత్రికిరాత్రి వెలిశాయి. భారీ స్థాయిలో విద్యార్థుల ఫీజులను మింగేశాయి.

 

ఈ స్కాం మరవక ముందే మరో భారీ కుంభకోణం వెలుగు చూసింది. అసలే ఫీజు రీయింబర్స్ మెంట్ సరిగా అమలు కాక విద్యార్థలు తీవ్ర ఇబ్బందులు పడుతన్నారు. మరో వైపు కళాశాలలు కూడా రీయిబర్స్ మెంట్ రాకపోవడంతో విద్యార్థుల నుంచే బలవంతంగా వసూలు చేస్తున్నాయి.

 

ప్రతిపక్షాలు కూడా ఫీజు రీయింబర్స్ మెంట్ ప్రధాన అస్ర్తంగా ప్రభుత్వాన్ని ఇరుకులపెట్టేలే ఇటీవల అనేక ఉద్యమాలు చేశాయి. ఆందోళనకు దిగాయి.

 

విద్యాసంవత్సరం గడుస్తున్న ఈ సమయంలో ఫీజు రీయింబర్స్ మెంట్ లోని మరో గోల్ మాల్ తాజాగా వెలుగు చూసింది.

 

కంచే చేను మేసిన చందంగా ఫీజు రీయింబర్స్ మెంట్ ను విడుదల చేయాల్సిన అధికారులే కక్కుర్తి పడ్డారు. అడ్డదారుల్లో రీయింబర్స్ మెంట్ ను సొంత ఖాతాలోకి మళ్లించేందుకు ప్రయత్నించి  అడ్డంగా దొరికిపోయారు.

 

నల్లగొండ జిల్లాలో ట్రెజరీ అధికారులు ఈ దారుణానికి ఒడిగట్టారు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు సంబంధించిన రూ.11కోట్లను  దోచుకునేందుకు ప్రయత్నించారు. అయితే ఆంధ్రాబ్యాంక్ అధికారులు దీనిపై అప్రమత్తమై  స్టేట్ ట్రెజరీకి సమాచారవివ్వడంతో వారి ప్రయత్నం భగ్నమైంది.

నల్లగొండ సబ్ ట్రెజరీ అధికారులు విక్రమ్, పురుషోత్తమ్ ఈ కుంభకోణానికి పాల్పడినట్లు అధికారులు గుర్తించారు.

40 కాలేజీలకు చేరాల్సిన నిధులను ఒకే కాలేజీకి బదిలీ చేసి అక్కడి నుంచి తమ ఖాతాలో వేసుకోడానికి వీళ్లు ప్రయత్నించినట్లు తెలిసింది.

Follow Us:
Download App:
  • android
  • ios