కన్నతండ్రే కూతుర్ని అమ్మకానికి పెట్టిన దారున సంఘటన మహబూబ్ నగర్ లో జరిగింది. తాగుడుకు బానిసైన ఓ తండ్రి కూతుర్ని అమ్మకానికి పెట్టాడు.

మహబూబ్ నగర్ వన్ టౌన్ సీఐ రాజేశ్వర్ గౌడ్ కథనం ప్రకారం.. పట్టణంలోని హనుమాన్ పురకు చెందిన సయ్యద్ రహీం, నౌషిమ్ బేగం దంపతులకు ఇద్దరు కొడుకులు, 18 నెలల కూతురు ఉంది. 

ఈ నెల 18న రహీం తన కూతురు జేబాను బిస్కెట్లు ఇప్పిస్తానని నమ్మబలికి బయటకు తీసుకెళ్లడు. వారు ఎంతకీ ఇంటికి తిరిగి రాకపోవడంతో భార్య అతడికి ఫోన్ చేసింది. అయినా సమాధానం లేదు. 

సాయంత్రం భర్త ఒక్కడే తిరిగి ఇంటికి వచ్చాడు. కూతురును తీసుకువెళ్లిన భర్త ఒక్కడే తిరిగి రావడంతో భార్య షాక్ అయ్యింది. కూతురు ఎక్కడా అని నిలదీసింది. కానీ భర్త సమాధానం చెప్పలేదు. అయినా ఊరుకోకుండా గట్టిగా నిలదీస్తే..హైదరాబాద్‌కు చెందిన సయ్యద్‌ హఫీజ్‌కు రూ.15 వేలకు విక్రయించినట్లు తెలిపాడు. 

దీంతో నౌషిమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఫిర్యాదును నమోదు చేసుకున్న పోలీసులు, ప్రత్యేక బృందాన్ని రంగంలోకి దింపారు. 24 గంటల్లోనే హైదరాబాద్‌లో ఉన్న పాపను గుర్తించి మహబూబ్ నగర్ సీడబ్ల్యూసీ అధికారులకు అప్పగించారు. 

అంతేకాదు పాపను కొన్ని సయ్యద్ హఫీజ్, అమ్మిన తండ్రి సయ్యద్ రహీంలను అరెస్ట్ చేసినట్లు సీఐ తెలిపారు. ఈ ఘటన స్తానికంగా కలకలం రేపింది. కాగా పోలీసులు 24 గంటల్లో కేసును చేధించడంతో సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది.