Asianet News TeluguAsianet News Telugu

కన్న కూతురిమీదే కన్నేసిన కామాంధుడు.. లైంగిక వేధింపులు తట్టుకోలేక ఆ బాలిక చేసిన పని..

ఇలాంటి అమానుష ఘటనే  తెలంగాణలో జరిగింది. కన్న కూతురిమీదే ఓ కామాందుడు కన్ను వేశాడు. అల్లారు ముద్దుగా పెంచి, అత్తారింటికి పంపించాల్సిన కన్న తండ్రే లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. కూతురు ఒప్పుకోకపోవడంతో రోజూ వేదించడం మొదలుపెట్టాడు. దీంతో తట్టుకోలేని ఆ కూతురు నేరుగా షీ టీంస్ ను ఆశ్రయించింది. 

father molested own daughter, she called she teams in mahabubnagar
Author
Hyderabad, First Published Aug 11, 2021, 4:57 PM IST
  • Facebook
  • Twitter
  • Whatsapp

కన్నతల్లిదండ్రులే పిల్లల మీద లైంగిక దాడులకు పాల్పడుతున్న సంఘటనలు రోజురోజుకూ సమాజంలోని పరిస్థితులకు అద్దం పడుతున్నాయి. వావి వరసలు మరిచి కన్నకూతురిమీదే అత్యాచారాలకు పాల్పడి, గర్భవతులుగా మార్చడం, లేదా నోరు తెరిస్తే నిర్థాక్షిణ్యంగా చంపేయడం చేస్తున్నారు.

ఇలాంటి అమానుష ఘటనే  తెలంగాణలో జరిగింది. కన్న కూతురిమీదే ఓ కామాందుడు కన్ను వేశాడు. అల్లారు ముద్దుగా పెంచి, అత్తారింటికి పంపించాల్సిన కన్న తండ్రే లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. కూతురు ఒప్పుకోకపోవడంతో రోజూ వేదించడం మొదలుపెట్టాడు. దీంతో తట్టుకోలేని ఆ కూతురు నేరుగా షీ టీంస్ ను ఆశ్రయించింది. 

ఈ దారుణమైన ఘటన మహబూబ్ నగర్ జిల్లా నవాబ్ పేటలో చోటు చేసుకుంది. కన్న కూతురిపైనే ఓ తండ్రి లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. దీంతో ఎటూ పాలుపోక ఆ బాధితురాలు ఏకంగా షీటీంను ఆశ్రయించి.. తన గోడు వెళ్లబోసుకుంది. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన వివరాల్లోకి వెడితే.. 

మహబూబ్ నగర్ జిల్లా నవాబ్ పేట మండలం మల్కాపూర్‌ గ్రామపంచాయతీ పరిధిలోని ఒక గిరిజన తండాలో 15 యేళ్ల ఓ బాలిక తల్లిదండ్రులతో కలిసి ఉంటోంది. వాళ్లతో పాటు కలిసి రోజూ కూలీ పనులకు వెడుతుంది. ఈ మధ్య కొద్ది రోజులుగా తండ్రి ఆ బాలిక మీద లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడు.

ఎన్నిసార్లు చెప్పినా వినిపించుకోవడం లేదు. రోజూ వేధింపులకు పాల్పడుతుండడంతో విసిగిపోయిన ఆ చిన్నారి ఏం చేయాలో పాలుపోక.. 100 నెంబర్ కు కాల్ చేసింది. వారు షీ టీంకు కనెక్ట్ చేయడంతో తన గోడు వెళ్లబోసుకుంది. 

దీంతో వెంటనే అప్రమత్తమైన పోలీసులు ఆ బాలికను చేరదీసి మహబూబ్‌నగర్‌లోని స్టేట్ హోం కు తరలించారు. అంతకు ముందు బాలికకు మెడికల్ టెస్టులు చేయించారు. ఆ మెడికల్ రిపోర్టుల అధారంగా  కేసు దర్యాప్తు చేస్తామని ఎస్‌ఐ శ్రీకాంత్‌ తెలిపారు.  

మరోవైపు, వివాహితను ఆమె మాజీ ప్రియుడు దారుణంగా హత్య చేసిన ఘటన జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిదిలో మంగళవారం చోటు చేసుకుంది. సీఐ కె.బాలరాజు చెప్పిన వివరాల ప్రకారం.. ఝార్ఖండ్ రాష్ట్రం ధన్ బాద్ కు చెందిన పూజ (21)కు అదే ప్రాంతానికి చెందిన రాజేంద్రన్ వర్మతో ఏ ఏడాది ఏప్రిల్ లో వివాహమయ్యింది. 

ఈ దంపతులు కొన్ని రోజుల క్రితం బతుకు దెరువు కోసం నగరానికి వచ్చారు. జీడిమెట్ల డివిజన్ వినాయకనగర్ లో ఓ ఇంట్లో అద్దెకు ఉంటున్నారు. పూజ నగరానికి వచ్చిన తరువాత.. గతంలో తాను ప్రేమించిన రాకేష్ అనే యువకుడితో ప్రతిరోజూ ఫోన్ లో మాట్లాడుతుండేది. ఆమె హైదరాబాద్ లో ఉంటున్న విషయం తెలుసుకున్న రాకేష్ మరో యువకుడితో కలిసి ధన్ బాద్ నుంచి మంగళవారం ఉదయం 11 గంటలకు జీడిమెట్లలోని పూజ ఉంటున్న ఇంటికి  చేరుకున్నారు.

రాకేష్ ఆమెతో కొద్దిసేపు మాట్లాడాడు. ఆ తరువాత తనతో ధన్ బాద్ రావాలని పట్టుబట్టాడు. పూజ అందుకు ఒప్పుకోలేదు. దీంతో ఈ విషయం మీద ఇద్దరి మధ్య గొడవ జరిగింది. ఈ ఘర్షణను గమనించిన.. అదే ఇంట్లో ఉంటున్న రింకు అనే వ్యక్తి ఆపేందుకు ప్రయత్నించాడు.

అయితే అడ్డువస్తే నీ కొడుకును చంపేస్తానని రాకేష్ బెదిరించాడు. ఆ తరువాత రాకేష్ తో ఝార్ఖండ్ నుంచి వచ్చిన యువకుడు పూజ కాళ్లను అదిమి పట్టుకున్నాడు. రాకేష్ దిండుతో ఆమె ముఖం మీద పెట్టి ఊపిరి ఆడకుండా చేసి హత్య చేశాడు. ఆ తరువాత నిందితులిద్దరూ అక్కడ్నుంచి పరారయ్యారు. 

విషయం తెలుసుకున్న జీడిమెట్ల పోలీసులు ఘటన స్థలాన్ని పరిశీలించారు. పూజ భర్త రాజేంద్రన్ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నారు. నిందితుల కోసం ప్రత్యేక బృందం గాలిస్తోంది.  

Follow Us:
Download App:
  • android
  • ios