హైదరాబాద్‌లో నేరెడ్‌మెట్‌లో ఇంటర్ విద్యార్ధి మృతి పలు అనుమానాలకు తావిస్తోంది. ఆర్కే పురం బాలాజీ కాలనీకి చెందిన సోహైల్ అనే విద్యార్ధి ఇంటర్మీడియట్ చదువుతున్నాడు. తండ్రి మహారుద్దీన్ ఆర్మీలో పనిచేసి రిటైర్ అయ్యారు.

ఈ క్రమంలో సోహైల్ సోమవారం అర్ధరాత్రి మంచంపై నిర్జీవంగా పడివున్నాడు. అతని తలలో తుపాకీతో కాల్చిన గుర్తు వుంది. ఇతను ఆత్మహత్యకు పాల్పడ్డడా.. ? లేదంటే ఎవరైనా కాల్చారా అన్నది పోలీసులకు అంతు పట్టడం లేదు.

అతని తండ్రి ఆర్మీలో పనిచేశాడు కాబట్టి లైసెన్స్‌డ్ గన్ ఉంటుంది.. ఇంటర్ ఫెయిల్ అవ్వడం వల్లే ఆత్మహత్య చేసుకున్నాడని భావిస్తున్నప్పటికీ మరేదైనా కోణం వుందా అన్నదానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు.