Asianet News TeluguAsianet News Telugu

బోయిన్ పల్లిలో విషాదం.. ఇద్దరు కూతుర్లను చంపి, తండ్రి ఆత్మహత్య..

ఓ తండ్రి తన ఇద్దరు కూతుర్లను హత్య చేసి, తానూ ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ దారుణ ఘటన సికింద్రాబాద్ బోయిన్ పల్లిలో వెలుగుచూసింది. 

Father killed two daughters and committed suicide in hyderabad - bsb
Author
First Published Oct 13, 2023, 7:37 AM IST

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ లోని బోయిన్ పల్లిలో విషాదం చోటు చేసుకుంది. తన ఇద్దరు కూతుర్లను చంపి ఓ వ్యక్తి తాను ఆత్మహత్య చేసుకున్నాడు. 8యేళ్ల స్రవంతి, ఏడేళ్ల శ్రావ్యను చంపి, తండ్రి శ్రీకాంత్ ఆత్మహత్య చేసుకున్నాడు. గుర్తు తెలియని టాబ్లెట్లు ఇచ్చి కూతుర్లను చంపేశాడు. ఆ తరువాత తానూ ఆత్మహత్య చేసుకున్నాడు. 

కుటుంబకలహాలే ఈ హత్యలు, ఆత్మహత్యలకు కారణంగా అనుమానిస్తున్నారు. నిద్రమాత్రలు ఇచ్చి కూతుళ్లకు చంపి తానూ ఆత్మహత్య చేసుకున్నాడు శ్రీకాంత్ అనే వ్యక్తి.  శ్రీకాంత్ మోండా మార్కెట్ లోని జ్యుయలరీ షాపులో పనిచేస్తున్నాడు. కొంతకాలంలో కుటుంబంలో కలహాలు నెలకొన్నాయి.

రాత్రి ఇద్దరు కూతుళ్లను తన దగ్గరే పడుకోబెట్టుకున్న శ్రీకాంత్ ఈ దారుణానికి ఒడిగట్టాడు. ఉదయం భార్య లేచి చూసేసరికి విగత జీవులుగా ఇద్దరు పిల్లలు, భర్త కనిపించారు. వెంటనే, బంధువులకు, పోలీసులకు సమాచారం అందించింది భార్య. అయితే, భార్యాభర్తల మధ్య గత కొద్ది కాలంగా వివాదాలు ఉన్నాయి. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. 

 

Follow Us:
Download App:
  • android
  • ios