Asianet News TeluguAsianet News Telugu

ఆస్తికోసం సొంత కూతురినే కడతేర్చాడు.. అల్లుడి పరిస్థితి విషమం...

గడ్డపారలతో రాములు దాడి చేయడంతో ఉషతీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందింది. మామ దాడిలో తీవ్రంగా గాయపడ్డ రామకృష్ణను చుట్టుపక్కల వారు ఆసుపత్రికి తరలించారు. 

Father assassinated daughter for property, Son-in-law's condition critical in khammam - bsb
Author
First Published Nov 10, 2023, 2:31 PM IST

వైరా : ఆస్తుల గొడవ మానవ సంబంధాలను మంట కలుపుతోంది.  కుటుంబ విలువలను నాశనం చేస్తోంది. ఆస్తి తగాదాల  నేపథ్యంలో  ఓ తండ్రి సొంత కూతురు.. అల్లుడు మీదే గడ్డపారతో దాడి చేశాడు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన కూతురు అక్కడికక్కడే మృతి చెందింది. అల్లుడు పరిస్థితి విషమంగా ఉంది పరిస్థితి విషమంగా ఉంది. ఈ ఘటన ఖమ్మం జిల్లా వైరా మండలం తాడిపత్రి గ్రామంలో వెలుగు చూసింది..

దీనికి సంబంధించి వైరా ఎస్సై మేడా ప్రసాద్ ఈ విధంగా వివరాలు తెలియజేశారు.. శుక్రవారం ఉదయం తాడిపూడి గ్రామానికి చెందిన రాములు.. తన కూతురు ఉష, ఆమె భర్త రామకృష్ణలపై దాడికి దిగాడు.  వారు కూడా అదే గ్రామంలో ఉంటున్నారు. గడ్డపారలతో రాములు దాడి చేయడంతో ఉష (28) తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందింది. మామ దాడిలో తీవ్రంగా గాయపడ్డ రామకృష్ణను చుట్టుపక్కల వారు ఆసుపత్రికి తరలించారు. 

ప్రస్తుతం రామకృష్ణ పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. దాడికి సంబంధించిన సమాచారం తెలియడంతో పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. రాములపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. దాడి అనంతరం రాములు ఘటనా స్థలం నుంచి పరారయ్యాడు. అతని గురించి పోలీసులు వెతుకుతున్నారు.
 

Follow Us:
Download App:
  • android
  • ios