పొలంలో బురదలో నుజ్జునుజ్జైన స్థితిలో ఓ రైతు అనుమానాస్పద మృతి చెందాడు. ఈ ఘటన జగిత్యాల జిల్లాలో వెలుగు చూసింది. 

జగిత్యాల : జగిత్యాల జిల్లా వెల్గటూరులో దారుణ ఘటన వెలుగు చూసింది. పొలంలోనే ఓ రైతు అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. ట్రాక్టర్ తో తొక్కించి హత్య చేసి.. బురదలో వేసి తొక్కించారు. దీంతో రైతు మృతదేహం నుజ్జు నుజ్జయ్యింది. అతడిని ఎవరో చంపారని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. దీనిమీద పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.