కేటిఆర్ సభలో రైతు ఆత్మహత్యాయత్నం, సీరియస్

First Published 16, May 2018, 2:55 PM IST
farmer suicide attempt in ktrs meeting
Highlights

దారుణం

తెలంగాణ ఐటి శాఖ మంత్రి కేటిఆర్ పాల్గొన్న రైతుబంధు చెక్కుల పంపిణీ సభలో అపశృతి చోటు చేసుకుంది. కేటిఆర్ సభలో ఒక రైతు పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు.
రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ఇల్లంతకుంట మండల కేంద్రంలో రాష్ర్ట ఐటి శాఖ మంత్రి కేటిఆర్ రైతు బంధు చెక్కులను పంపిణీ చేస్తున్నారు. ఈ సందర్భంగా అక్కడికి వచ్చిన ఓగులాపూర్ గ్రామానికి చెందిన ఇల్లందుల కిష్టయ్య అనే రైతు పురుగుల మందు తాగి ఆత్మహత్యయత్నానికి పాల్పడ్డారు. ఆ రైతు పరిస్థితి విషమంగా ఉందని తెలుస్తోంది.

హుటాహుటిన స్థానికులు, పోలీసులు కిష్టయ్యను కరీంనగర్ లోని ఆసుపత్రికి తరలించారు. కేటిఆర్ సభలో ఈ ఘటన జరగడం సంచలనం రేపింది. ఈ ఘటన తాలూకు పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

loader