మెదక్ జిల్లాలో పురుగుల మందు తాగి తల్లీ కొడుకు ఆత్మహత్యాయత్నం
ఉమ్మడి మెదక్ జిల్లాలోని కౌడిపల్లి మండలం దేవులపల్లి గ్రామానికి చెందిన రైతు శ్రీశైలం ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. తన భూమిలో ప్రకృతి వనం నిర్మించాడాన్ని ఆయన వ్యతిరేకించాడు. ఈ విషయం తెలుసుకున్న తల్లి కూడా పురుగుల మందు తాగి ఆత్మహత్యాయతనం చేసింది. తొలుత వీరిద్దరూ మరణించారని మీడియాలో కథనాలు వచ్చాయి. చేసింది. అయితే వీరిద్దరూ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
మెదక్: ఉమ్మడి Medak జిల్లాలో తల్లీ, కొడుకులు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. పురుగుల మందు తాగిన తల్లీ కొడుకులు ఆత్మహథ్యాయత్నానికి పాల్పడ్డారు.
ఉమ్మడి మెదక్ జిల్లాలోని కౌడిపల్లి మండలం దేవులపల్లి గ్రామానికి చెందిన రైతు Srisailam కు ఐదు ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. అయితే ఈ భూమిలో మిర్చి పంట సాగు చేశాడు.అయితే ఈ భూమిలో ప్రకృతి వనం ఏర్పాటు చేస్తామని సర్పంచ్ ఫారెస్ట్ అధికారులు కొంత కాలంగా చెబుతున్నారు. ఈ భూమి కావాలని తనను వేధిస్తున్నారని శ్రీశైలం ఆరోపించారు.అయితే తాను తన పొలం వద్ద లేని సమయంలో ప్రొక్లెయినర్ సహాయంతో మిర్చి పంటను నాశనం చేశారని శ్రీశైలం ఆరోపించారు. ఈ విషయమై పొలం వద్దే పురుగుల మందు తాగి శ్రీశైలం ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. దీంతో అతను అక్కడే కుప్పకూలిపోయాడు. అదే సమయంలో పొలం వద్దకు వచ్చిన తల్లీ కూడా కొడుకు పురుగుల మందు తాగిన విషయాన్ని గుర్తించి తాను కూడా పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది.
ఆత్మహత్యాయత్నానికి పాల్పడే ముందు శ్రీశైలం సెల్ఫీ వీడియో రికార్డు చేశాడు.తన ఆత్మహత్యాయత్నానికి గల కారణాలను కూడా వివరించారు. తన ఆత్మహత్యతోనైనా తన కూతురు, కొడుకుకు న్యాయం జరుగుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. వీడియో రికార్డు చేస్తూనే పురుగుల మందు తాగి శ్రీశైలం ఆత్మహత్యాయత్నం చేశాడు. ఈ విషయాన్ని గుర్ించిన స్థానికులు వెంటనే అతడిని ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో శ్రీశైలం, అతని తల్లి చికిత్స పొంుదుతన్నారు. అయితే వీరిద్దరూ మరణించినట్టుగా ప్రముఖ తెలుగు న్యూస్ చానెల్ ఎన్టీవీ ఈ నెల 7వ తేదీన కథనం ప్రసారం చేసింది. అయితే వీరిద్దరూ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్టుగా గ్రామస్తుులు తెలిపారు. అయితే ఆసుపత్రిలో చికిత్సతో వీరిద్దరూ కోలుకుంటున్నట్టుగా గ్రామస్తులు,తెలిపారు. తల్లీ కొడుకుల ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని సమాచారం.