తెలంగాణ పొలాల్లో కాజల్ పోస్టర్ల కలకలం

First Published 30, Jun 2018, 11:28 AM IST
farmer put up kajal agarwal posters in agriculture land
Highlights

తెలంగాణ పొలాల్లో కాజల్ పోస్టర్ల కలకలం

ఇదివరకటి రోజుల్లో ఏపుగా పెరిగిన పంటలకు నలుగురి దిష్టి తగలకుండా.. నల్లకుండనో.. నిమ్మకాయలో.. చెత్త బొమ్మనో పెట్టేవారు కానీ నెల్లూరు జిల్లాకు చెందిన చెన్నారెడ్డి అనే రైతు తన పంటకు దిష్టి తగలకుండా ఉండేందుకు ఏం చేశాడో గుర్తుంది కదా..? బాలీవుడ్ సెక్సీ బాంబ్ సన్నీ లియోన్‌ హాట్ ఫోటోలను పంట పొలంలో పెట్టించాడు. దీంతో దారిన పోయే వాళ్లంతా పంటను చూడకుండా సన్నీని చూశారని.. అందువల్ల సత్ఫాలితాలు వచ్చాయని చెప్పుకొచ్చాడు..

చెన్నారెడ్డిని స్పూర్తిగా తీసుకుని తెలంగాణకు చెందిన అన్వర్ తన పంటపొలాలకు రక్షణగా కాజల్ పోస్టర్లు ఏర్పాటు చేశారు.. సంగారెడ్డి జిల్లా కొండారెడ్డి మండలం గొల్లపల్లికి చెందిన అన్వర్‌కు రెండెకరాల వ్యవసాయ భూమి ఉంది.. అందులో కూరగాయలను సాగు చేస్తున్నారు.. ఈ వ్యవసాయ భూమి రోడ్డు పక్కనే ఉండటంతో అటుగా వెళ్తున్న వారు.. పంట బాగా పండిందే అనుకుంటుండటం అన్వర్ చెవిన పడింది.

దీని వల్ల తన పంటకు దిష్టి తగులుతుందని భావించి తనకు ఎంతో ఇష్టమైన హీరోయిన్ కాజల్ అగర్వాల్‌ కటౌట్‌లను పొలంలో పెట్టించాడు. ఇప్పుడు అందరూ పంటను చూడకుండా కాజల్ పోస్టర్ వైపు చూస్తుండటంతో రైతు సంబరపడిపోతున్నాడు. ఇప్పటి వరకు సన్నీ, కాజల్ ఫోటోలు పొలాల్లోకి రాగా.. రాబోయే కాలంలో ఇంకేంత మంది హీరోయిన్లు పొలాల్లోకి వస్తారో చూడాలి.

loader