హైదరాబాద్:  రాష్ట్రంలో  రూ. 25 వేల రూపాయాల లోపు రుణాలను తీసుకొన్న రుణాలను నూటికి నూరు శాతం  ఒకే దఫా మాఫీ చేస్తామని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది.  

తెలంగాణ రాష్ట్ర వార్షిక బడ్జెట్‌ 2020ను తెలంగాణ ఆర్ధిక శాఖ మంత్రి హరీష్ రావు ఆదివారం నాడు అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. ఆర్ధిక శాఖ మంత్రిగా హరీష్ రావు తొలిసారిగా బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు.

 2014 ఎన్నికల మేనిఫెస్టో‌లో  లక్ష రూపాయాల లోపు ఉన్న రైతులకు వ్యవసాయ రుణాలను మాఫీ చేస్తామని  ప్రకటించిన విషయాన్ని మంత్రి గుర్తు చేశారు.ఈ హామీలో భాగంగానే రూ. 16, 124 కోట్ల రుణాలను మాపీ చేసినట్టుగా చెప్పారు.

Also read:తెలంగాణ బడ్జెట్ 2020, లైవ్ అప్‌డేట్స్: లక్షా 82 వేల 914 కోట్లతో తెలంగాణ బడ్జెట్

గత ఎన్నికల్లో కూడ రైతులకు రుణమాఫీ చేస్తామని ప్రకటించిన విషయాన్ని ఆయన ప్రస్తావించారు.ఆర్ధిక మాంద్యం ఇబ్బందులు కల్గిస్తున్నా కూడ లెక్క చేయకుండా రైతుల శ్రేయస్సును దృష్టిలో ఉంచుకొని రుణమాఫీని అమలు చేస్తున్నామన్నారు

రూ. 25వేల లోపు రుణాలను ఒకేసారి మాపీ చేస్తామని మంత్రి హరీష్ రావు ప్రకటించారు.  రాష్ట్రంలో 5,83,916 మంది రైతులు రూ. 25వేలను అప్పుగా తీసుకొన్నట్టుగా ప్రభుత్వం ప్రకటించింది. 

 ఈ రైతుల రుణాలను నూటికి నూరు శాతం ఒకే దఫా మాఫీ చేస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. ఇదే నెలలో రూ. 25 వేల లోపు రుణాలను ఏక కాలంలో మాఫీ చేస్తామని  ప్రకటించింది సర్కార్. ఈ మేరకు రూ.1,198 కోట్లను విడుదల చేయనున్నట్టుగా ప్రభుత్వం ప్రకటించింది. 

 ఈ రుణ మాఫీ మొత్తాలను ప్రతి రైతుకు వ్యక్తిగతంగా చెక్కుల రూపంలో గౌరవ సభ్యుల చేతుల మీదుగా అందించనుంది.

రూ. 25 వేల నుండి లక్ష రూపాయాల లోపు ఉన్న రుణాలను  రూ. 24,738 కోట్లు ఉన్నట్టుగా ప్రభుత్వం ప్రకటించింది. ఈ రుణాలను  నాలుగు విడతలుగా మాఫీ చేయాలని నిర్ణయం తీసుకొన్నట్టుగా మంత్రి హరీష్ రావు ప్రకటించారు.రైతులకు ఆయా నియోజకవర్గాలకు చెందిన ఎమ్మెల్యే ద్వారా ఈ చెక్కులను అందిస్తామని ప్రభుత్వం స్పష్టం చేసింది.