ఇంట్లో ఒంటరిగా ఉంటున్న ఓ మైనర్ బాలికపై ఓ యువ రైతు అత్యాచారానికి పాల్పడ్డాడు. కాగా..  నిందితుడిని తాజాగా పోలీసులు అరెస్టు చేశారు. ఈ సంఘటన వికారాబాద్ లో చోటుచేసుకోగా.. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

వికారాబాద్ జిల్లా యాలాల్ మండలానికి చెందిన ఓ యువకుడు(27) వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తున్నారు. ఇతరుల పొలాల్లో కూడా పనులు చేస్తూ ఉంటాడు. కాగా.. అదే ప్రాంతానికి చెందిన ఓ మైనర్ బాలికపై యువకుడి కన్ను పడింది. సదరు బాలిక తల్లిదండ్రులు పనుల కోసం బయటకు వెళ్లగా.. ఆమె ఒంటరిగా ఇంట్లో ఉంటోంది.

కాగా,.. అదే అదునుగా భావించిన యువకుడు బుధవారం మధ్యాహ్నం బాలిక ఇంట్లోకి ప్రవేశించాడు. ఎవరూ లేని సమయం చూసుకొని బాలికపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. అనంతరం ఈ విషయం ఎవరికీ చెప్పవద్దంటూ బాలికను బెదిరించి.. అక్కడి నుంచి పరారయ్యాడు. కాగా...  పనుల కోసం వెళ్లిన తల్లిదండ్రులు ఇంటికి రాగానే.. బాలిక జరిగిన ఘోరాన్ని వారికి వివరించింది.

బాలిక తల్లిదండ్రులు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. కాగా.. గురువారం పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు. బాలికను వైద్య పరీక్షల నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు చెప్పారు.