Asianet News TeluguAsianet News Telugu

కామారెడ్డిలో దారుణం : ధాన్యం కొనుగోలు కేంద్రం దగ్గరే ప్రాణాలు విడిచిన రైతు

కామారెడ్డి (kamareddy) జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. లింగంపేట్ (lingam pet) వరి ధాన్యం (paddy) కొనుగోలు కేంద్రంలో రైతుల అకాల మృత్యువాతపడ్డాడు. గుండెపోటుతో ధాన్యం కుప్పపై కుప్పకూలిన (farmer death) ఐలాపూర్ గ్రామానికి చెందిన రైతు వీరయ్య.. కొనుగోలు ఆలస్యం కారణంగా ధాన్యం కుప్ప వద్ద నిద్రిస్తూ మరణించాడు. 

farmer died near a grain purchasing center in kamareddy district
Author
Kamareddy, First Published Nov 5, 2021, 2:35 PM IST

కామారెడ్డి (kamareddy) జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. లింగంపేట్ (lingam pet) వరి ధాన్యం (paddy) కొనుగోలు కేంద్రంలో రైతుల అకాల మృత్యువాతపడ్డాడు. గుండెపోటుతో ధాన్యం కుప్పపై కుప్పకూలిన (farmer death) ఐలాపూర్ గ్రామానికి చెందిన రైతు వీరయ్య.. కొనుగోలు ఆలస్యం కారణంగా ధాన్యం కుప్ప వద్ద నిద్రిస్తూ మరణించాడు. 

వారం రోజుల కిందట వడ్లను కొనుగోలు సెంటర్‌కు తీసుకొచ్చాడు రైతు. రోజూ వడ్ల కుప్ప దగ్గర కాపలా ఉంటున్నాడు. నిన్న రాత్రి ఇంటికి వెళ్లి భోజనం చేసి మళ్లీ సెంటర్ కు వచ్చి వడ్ల కుప్ప దగ్గరే నిద్రపోయాడు. ఉదయం రైతు వీరయ్య ఇంటికి రాకపోవటంతో ఆయన భార్య.. కొనుగోలు సెంటర్‌కు వచ్చి చూసింది. అప్పటికీ వీరయ్య నిద్ర లేవలేదు. ఎంత లేపినా ఆయన మేల్కోలేదు. 

Also Read:ఎందుకు వరి వద్దంటున్నారు.. సాగు చేస్తే ఉరి వేస్తారా: కేసీఆర్‌పై బండి సంజయ్ విమర్శలు

తెలంగాణ ప్రభుత్వం వడ్లు కొంటున్నామని..ఊరూరా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశామని గొప్పలు చెప్పుకుంటూ పోతుంది. కానీ గ్రౌండ్ లో పరిస్థితి దారుణంగా ఉందంటూ మండిపడుతున్నారు రైతులు. వడ్లు కొంటున్నారని కొనుగోలు కేంద్రానికి ధాన్యం తీసుకొస్తే అధికారులు పట్టించుకోవడం లేదంటున్నారు అన్నదాతలు. వారం రోజుల నుంచి పడిగాపులు కాస్తూ ఓ రైతు ధాన్యం అమ్ముకోలేని పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
 
Follow Us:
Download App:
  • android
  • ios