జనానికి ఫ్యాన్సీ నెంబర్లపై క్రేజు నానాటికీ పెరిగిపోతోంది. జాతకాలు, న్యూమరాలజీని బాగా నమ్మడంతో పాటు స్టేటస్ కోసం తమ వాహనాలకు ఫ్యాన్సీ నెంబర్లు ఉండాలని చాలా మంది భావిస్తున్నారు.

ఇందుకోసం లక్షలు ఖర్చు చేసేందుకు సైతం వెనుకాడటం లేదు. ఈ క్రేజ్‌ను క్యాష్ చేసుకుంటున్న రవాణా శాఖ సోమవారం ఒక్క రోజే ఫ్యాన్సీ నెంబర్ల ద్వారా రూ.30.55 లక్షలు ఆదాయాన్ని పొందింది.

టీఎస్ 09 ఎఫ్ఈ 9999 ఫ్యాన్సీ నెంబర్‌ను ఎన్ఎష్ఎల్ ప్రాపర్టీస్ రూ.10 లక్షలకు సొంతం చేసుకుంది. కోటి 63 లక్షల విలువ చేసే టొయోటా ల్యాండ్ క్రూజర్ కారు కోసం ఈ నెంబర్‌ సొంతం చేసుకున్నారు.

టీఎస్ 09 ఎఫ్ఈ 0001 ఫ్యాన్సీ నెంబర్‌ను రూ.6.95 లక్షలు వెచ్చించి ఎఫ్ఆర్ఆర్ఎన్ హిల్ హోటల్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ సొంతం చేసుకుంది. అలాగే టీఎస్ 09 ఎస్ఈ 0099 ఫ్యాన్సీ నెంబర్‌ను రూ. 2.78 లక్షలు వెచ్చించి కొనుగోలు చేశారు.